Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సన్నగా ఉన్నా పొట్ట ఉందా? అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్టే..షాకింగ్ నిజం చెప్పిన డాక్టర్
లివర్ (కాలేయం) వ్యాధి అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది మందు. మందు తాగేవారికి మాత్రమే లివర్ పాడవుతుందని మనం బలంగా నమ్ముతాం. కానీ ఈ నమ్మకం తప్పు అని చెబుతున్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్.
సోషల్ మీడియాలో ది లివర్ డాక్ గా సుపరిచితులైన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ప్రకారం..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వల్ల కాకుండా, జీవనశైలి లోపాల వల్ల వచ్చే MASLD (మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్) అత్యంత సాధారణ దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగా మారింది.

పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే
సాధారణ వయోజనుల్లో 30-40 శాతం మందికి, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఏకంగా 70 శాతం మందికి ఈ సమస్య ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో చాలామంది అస్సలు మద్యం ముట్టుకోనివారే.
మందు తాగని వారికి ఎందుకు వస్తోంది?
ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ ప్రకారం.. ఇది మన శరీరంలోని జీవక్రియ దెబ్బతినడం వల్ల వస్తుంది. భారతీయులలో థిన్ ఫ్యాట్ (చూడటానికి సన్నగా ఉన్నా, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం) లక్షణం ఎక్కువ.
మనం ఎక్కువగా తినే తెల్ల అన్నం, మైదా, కూల్ డ్రింక్స్, స్వీట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేదు. ఫలితంగా కాలేయం అదనపు చక్కెరను కొవ్వుగా మార్చి తనలో దాచుకుంటుంది. ఇదే రానురాను లివర్ వాపుకు దారితీస్తుంది.
సైలెంట్ కిల్లర్..లక్షణాలు కనిపించవు
ప్రారంభ దశలో దీనికి ఎటువంటి లక్షణాలు ఉండవు. కొందరికి అలసటగా అనిపించడం, కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ అనిపించడం వంటివి జరుగుతాయి. కానీ లోపల జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్ (లివర్ పూర్తిగా పాడవ్వడం), లివర్ ఫెయిల్యూర్, చివరకు లివర్ క్యాన్సర్ కు కూడా దారి తీయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
దీనికి పరిష్కారం ఏంటి?
దీనికి అద్భుతమైన మందులు, టానిక్కులు, సోషల్ మీడియాలో చూసే డీటాక్స్ డ్రింక్స్ అస్సలు పనిచేయవు. దీనికి ఏకైక మందు జీవనశైలి మార్పు మాత్రమే.
ఆహారం: ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పంచదార, మైదా పూర్తిగా తగ్గించాలి.
బరువు తగ్గడం: ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం ముఖ్యం.
వ్యాయామం: వారానికి కనీసం 150 నిమిషాల వాకింగ్ లేదా వ్యాయామం తప్పనిసరి.
కాఫీ మ్యాజిక్: రోజుకు 3 కప్పుల వరకు చక్కెర లేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ డ్యామేజ్, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











