Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
ఉప్పు నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మన రోజువారీ జీవితంలో స్నానం ఒక భాగం. కొంతమంది ఉదయం,సాయంత్రం రెండుపూటలా స్నానం చేస్తారు..మరికొందరు రోజులో ఒక పూట మాత్రమే స్నానం చేస్తుంటారు. స్నానం చేయడం వల్ల ఒంటిమీద ఉన్న మురికిని తొలగించడమే కాకుండా శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది. అయితే ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? స్నానం చేసే నీళ్లలో ఉప్పు కలిపి ఆ నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. ఇది కేవలం ఒక చిట్కా కాదు..శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం.
ఉప్పునీటి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలివే
కండరాలకు, కీళ్లకు నూతన ఉత్తేజం
ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. కండరాల నొప్పులు, కీళ్ల వాపులతో బాధపడుతున్నోళ్లకు ఇది చాలా మంచిది. గోరువెచ్చని ఉప్పునీటి స్నానం మీ కండరాలకు ఉపశమనాన్ని అందించి, నొప్పులను మాయం చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి, వాపులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

అలసట పోయి, ప్రశాంతత
రోజంతా పడిన శ్రమ, మానసిక ఒత్తిడి కారణంగా శరీరం నీరసించిపోతుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చని ఉప్పునీటితో స్నానం చేస్తే శరీరంలోని అలసట మొత్తం మాయమవుతుంది. ఉప్పులోని మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని రిలాక్స్ చేసి, మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
సౌందర్యాన్ని పెంచే నేచురల్ మార్గం
కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి కూడా ఉప్పునీరు ఒక వరం. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను సున్నితంగా తొలగించి, సహజమైన ఎక్స్ ఫోలియెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం శుభ్రపడి మరింత కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. తామర, దురద వంటి చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేసి చికాకును తగ్గిస్తుంది.
మానసిక ఒత్తిడికి చెక్, గాఢమైన నిద్ర
ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఉప్పునీటి స్నానం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మీ నరాలను శాంతపరిచి, మనసును తేలికపరుస్తుంది. దీనికి కొన్ని చుక్కల లావెండర్ వంటి సుగంధ తైలాలను జోడిస్తే దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. ప్రశాంతమైన మనసుతో రాత్రిపూట గాఢమైన, కలతల్లేని నిద్రకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఉప్పునీటి స్నానాన్ని ఎలా రెడీ చేసుకోవాలి?
ఒక బకెట్ లేదా టబ్ నిండా మీకు నచ్చినంత గోరువెచ్చని నీటిని నింపండి. ఇందులో రెండు లేదా మూడు చెంచాల కల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు కలపండి. ఉప్పు నీటిలో పూర్తిగా కరిగే వరకు వేచి ఉండండి. ఇప్పుడు మీ ప్రశాంతమైన స్నానానికి నీరు రెడీ. స్నానం తర్వాత శరీరాన్ని పొడిగా తుడుచుకుని, తప్పకుండా మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోండి.
ఎంత తరచుగా చేయాలి?
సాధారణంగా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం మంచిది. అయితే మీకు శరీర నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించినప్పుడు కూడా ఈ స్నానాన్ని ప్రయత్నించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications