Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Moles on Body: ఆ పుట్టుమచ్చ కాన్సర్ సంకేతమే!
దాదాపు అందరికీ శరీరంలో ఏదో ఒక చోట పుట్టుమచ్చలు ఉంటాయి. ఫలానా చోట పుట్టుమచ్చ ఉంటే అదృష్టం,ఫలానా చోట ఉంటే దురదృష్టం అని కూడా భావిస్తుంటారు కొందరు.నువ్వు గింజంత నల్లగా, బుగ్గ మీదో, పెదవి కిందో ఉండే ఓ చిన్న మచ్చ మన ముఖానికి ప్రత్యేకమైన కళను తెస్తుందనడంలో సందేహం లేదు. మన శరీరంలోని ఈ చిన్న గుర్తులను చూసి మురిసిపోతాం. కాన, మనం ఎంతో ఇష్టపడే ఈ చిన్న అందమైన మచ్చే కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఓ తీవ్రమైన వ్యాధికి తొలి సంకేతం కాగలదని మీకు తెలుసా?
మన శరీరంపై ఉండే తొంభై తొమ్మిది శాతం పుట్టుమచ్చలు పూర్తిగా హానిచేయనివి. అవి మన చర్మంలో ఒక సాధారణ భాగం. వాటి వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు దాదాపుగా ఉండవు. కానీ, అరుదైన కొన్ని సందర్భాలలో ఒక సాధారణ పుట్టుమచ్చ తన స్వరూపాన్ని మార్చుకుని, చర్మ క్యాన్సర్ గా పరిణామం చెందే అవకాశం ఉంది. మెడికల్ బాషలో ఈ క్యాన్సర్ ను మెలనోమా అని పిలుస్తారు.

తెల్లవాళ్లకు
భారతీయుల చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటం వల్ల మనకు మెలనోమా వచ్చే ప్రమాదం శ్వేతజాతీయులతో పోలిస్తే చాలా తక్కువ. ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక రక్షణ కవచం లాంటిది. అయినప్పటికీ ప్రమాదం పూర్తిగా సున్నా అని చెప్పలేం. అందుకే మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలలో కలిగే మార్పుల పట్ల మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
మీ శరీరంపై ఎన్నో ఏళ్లుగా ఉన్న పుట్టుమచ్చలో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నాయా? దాని పరిమాణం పెరుగుతున్నట్లు లేదా రంగు మారుతున్నట్లు అనిపిస్తోందా? అయితే మీరు వెంటనే దానిపై దృష్టి పెట్టాలి. కొన్ని లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు.
5 ప్రమాద సంకేతాలను గమనించండి
ఆకారంలో మార్పు: పుట్టుమచ్చ సరిహద్దులు అస్పష్టంగా, వంకరటింకరగా మారడం.
రంగులో మార్పు: పుట్టుమచ్చ రంగు ఒకేలా కాకుండా నలుపు, గోధుమ, ఎరుపు వంటి రంగుల కలయికగా మారడం.
పరిమాణం పెరగడం: పుట్టుమచ్చ ఆరు మిల్లీమీటర్ల (పెన్సిల్ చివర ఉండే రబ్బరు) కన్నా పెద్దదిగా అవ్వడం లేదా వేగంగా పెరగడం.
దురద లేదా నొప్పి: పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో అకస్మాత్తుగా దురద, నొప్పి లేదా మంట కలగడం.
రక్తస్రావం: ఎటువంటి గాయం తగలకుండానే పుట్టుమచ్చ నుండి రక్తం కారడం లేదా పైన పొక్కు కట్టడం.
పుట్టుమచ్చ నుండి రక్తస్రావం కావడం అనేది అత్యంత తీవ్రమైన సంకేతాలలో ఒకటి. ఇది పుట్టుమచ్చలోని కణాలు అసాధారణంగా పెరిగి క్యాన్సర్ గా మారే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, సొంత వైద్యం కాకుండా వెంటనే అనుభవజ్ఞులైన చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మెలనోమాను ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత సులభం. చిన్న మార్పును కూడా గమనించి, సరైన సమయంలో స్పందించడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications