Latest Updates
-
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.?
ప్రకృతి ప్రసాదించిన వయాగ్రా ఇదే..తిన్నారంటే లైంగిక సమస్యలన్నీ మాయం!
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొన్ని మొక్కలు చూడటానికి సాధారణంగా ఉన్నా వాటిలో అపారమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ఔషధమే 'కౌంచ్ బీజ్'. ఒక చిన్న విత్తనంలా కనిపించే ఇందులో శతాబ్దాలుగా ఆయుర్వేదం గుర్తించిన అద్భుత శక్తి నిగూఢమై ఉంది. తీగ రూపంలో పెరిగే ఈ మొక్క విత్తనాలు ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుంది. గోధుమ, నలుపు రంగులలో లభించే ఈ గింజలు పురుషులలో నూతనోత్తేజాన్ని నింపడానికి, మానసిక ప్రశాంతతను అందించడానికి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం లాంటివి.
నేచురల్ వయాగ్రా
ఆయుర్వేద గ్రంథాలలో కౌంచ్ బీజ్‌ను వాజీకరణ"ః ద్రవ్యంగా తెలిపారు, అంటే లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధం అని అర్థం. ఈ కంప్యూటర్ కాలంలో చాలా మంది పురుషులు ఎదుర్కొనే లైంగిక బలహీనత, శీఘ్రస్కలనం, వీర్యకణాల లోపం వంటి సమస్యలకు ఇది ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది కేవలం తాత్కాలిక ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను సహజంగా పెంచుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ అనే పురుష హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేసి,లైంగిక వాంఛను (లిబిడో) వృద్ధి చేస్తుంది. ఈ అద్భుతమైన లక్షణాల వల్లే దీనిని ఆయుర్వేద నిపుణులు సహజ వయాగ్రా అని పిలుస్తారు.

కేవలం శృంగార సామర్థ్యానికే కాదు
కౌంచ్ బీజ్ ప్రయోజనాలు లైంగిక ఆరోగ్యానికే పరిమితం కాదు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సర్వసాధారణమైన ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసటను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని ప్రత్యేక గుణాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం మెదడులో ఆనందాన్ని, చురుకుదనాన్ని నియంత్రించే డోపమైన్ అనే రసాయనాన్ని పెంచే శక్తి దీనికి ఉంది. అందుకే పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా ఇది సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇక శారీరక బలం విషయానికొస్తే,కౌంచ్ బీజ్ ఒక శక్తి కేంద్రం. ఇందులో ఉండే ప్రోటీన్లు కండరాలకు బలాన్నిచ్చి రోజంతా నీరసం, అలసట లేకుండా చురుకుగా ఉంచుతాయి. క్రీడాకారులు, శారీరక శ్రమ చేసేవారు దీనిని తీసుకోవడం ద్వారా తమ ప్రదర్శనను, శక్తిని పెంచుకోవచ్చు. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచితే, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. మొత్తంమీద, కౌంచ్ బీజ్ అనేది శారీరక బలాన్ని, మానసిక ప్రశాంతతను, లైంగిక ఆరోగ్యాన్ని ఏకకాలంలో అందించే ఒక సంపూర్ణ ఆయుర్వేద అద్భుతం. అయితే ఏదైనా కొత్త ఔషధాన్ని ప్రయత్నించే ముందు ఆయుర్వేద నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications