Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ట్యాబ్లెట్స్ కూర్చొని వేసుకోవాలా? నిలబడి వేసుకోవాలా? ఏది మంచిదంటే..
ఎండాకాలం,వర్షాకాలం,చలికాలం రుతువు ఏదైనా సరే మనమో లేదా మన కుటుంబసభ్యుల్లో ఎవరు ఒకరు జలుబు, దగ్గు, జ్వరం బారిన పడటం సర్వసాధారణం. దీంతో వెంటనే హాస్పిటల్ కి లేదా ఆర్ఎంపీ డాక్టర్ కి పరుగెత్తుతాం. డాక్టర్ మనల్ని చెక్ చేసి మన అనారోగ్యాన్ని బట్టి మాత్రలో, క్యాప్సూలో లేదా సిరప్ లో రాసిస్తారు. రోజుకు ఎన్నిసార్లు వేసుకోవాలో కూడా స్పష్టంగా చెబుతారు. కానీ ఒక్క విషయం మాత్రం దాదాపు ఎవరూ చెప్పరు, మనం కూడా పెద్దగా పట్టించుకోము. అదే ఆ మెడిసిన్ ను ఎలా వేసుకోవాలి? అంటే నిలబడాలి వేసుకోవాలా, కూర్చోవాలో లేక పడుకోని మెడిసిన్ వేసుకోవాలా?
మీరు ట్యాబ్లెట్స్ ఎలా వేసుకుంటారు?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అత్యంత శ్రేయస్కరమైన, సురక్షితమైన పద్ధతి నిటారుగా కూర్చోవడం. ఎందుకంటే మనం మాత్ర వేసుకున్నప్పుడు, అది మన గొంతు నుండి అన్నవాహిక ద్వారా జీర్ణాశయానికి ప్రయాణిస్తుంది. మనం కూర్చుని, ఒక గ్లాసు నిండా నీళ్లు తాగినప్పుడు, గురుత్వాకర్షణ శక్తి సహాయంతో ఆ మాత్ర సులభంగా, వేగంగా కడుపులోకి చేరుకుంటుంది. అక్కడ అది సరిగ్గా కరిగి, రక్తంలో కలిసి, వ్యాధిని తగ్గించడానికి తన పనిని ప్రారంభిస్తుంది. రక్తపోటు,నాడీ పనితీరును ప్రభావితం చేస్తుందో లేదో చూడటానికి కూర్చుని మందులు తీసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.

పడుకుని మాత్ర వేసుకుంటే ఏమవుతుంది?
ఇది చాలా ప్రమాదకరం. మాత్ర అన్నవాహికలోనే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఛాతీలో నొప్పి, మంట కలగడమే కాకుండా కొన్నిసార్లు అన్నవాహిక వాల్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది.
కొన్ని మందులను పడుకునే తీసుకోమంటారు కదా?
కొన్ని ప్రత్యేక మందుల విషయంలో డాక్టర్లే పడుకుని తీసుకోమని సూచిస్తారు. కారణం ఏంటంటే.. ఆ మందులు వేసుకున్న వెంటనే కళ్లు తిరగడం, తల తేలిపోవడం వంటివి జరగవచ్చు. అలాంటి సమయంలో నిలబడినా, కూర్చున్నా కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికే డాక్టర్లు ఈ ముందు జాగ్రత్త సలహా ఇస్తారు. కాబట్టి మీ డాక్టర్ ప్రత్యేకంగా సూచిస్తే తప్ప ఎల్లప్పుడూ నిటారుగా కూర్చుని, కనీసం ఒక గ్లాసు నీటితో మీ మందులను తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications