Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
మహిళలకు కాకుండా మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఏమవుతుందో తెలుసా?
మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం కామన్. పీరియడ్స్ సమయంలో నేటికీ చాలామంది ఇళ్లల్లో ఆ మహిళలను వంట చేయనివ్వరు,వారు చేసింది తినరు, ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఆ సమయంలో శుభకార్యాలకు కూడా వెళ్లకూడదని చెబుతుంటారు. పీరియడ్స్ ను చాలా అపవిత్రమైనదిగా నేటికీ కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే మహిళలకు కాకుండా పురుషులకు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటది అని ఎప్పుడైనా ఆలోచించారా? పురుషులకు నెలసరి వస్తే ఈ సమాజం ఎలా ఉండేది?
మహిళలు శతాబ్దాలుగా సిగ్గుతో, అవమానంతో, అపవిత్రంగా భావిస్తూ దాచుకుంటున్న ఈ శారీరక ప్రక్రియ అప్పుడు కూడా అలాగే ఉండేదా? అబ్బేఅస్సలు కాదు..అది పౌరుషానికి, గర్వానికి, అధికారానికి చిహ్నంగా మారేదని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, ఉద్యమకారిణి గ్లోరియా స్టెయినెమ్ అంటున్నారు. 47 సంవత్సరాల క్రితం Ms. మ్యాగజైన్ లో గ్లోరియా స్టెయినెమ్ రాసిన "ఇఫ్ మెన్ కుడ్ మెన్‌స్ట్రువేట్" (పురుషులకు ఋతుస్రావం వస్తే) అనే ఆర్టికల్ సమాజంలో లింగ వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఒక పదునైన వ్యంగ్యాస్త్రం.

గర్వకారణంగా మారే ఋతుస్రావం
స్టెయినెమ్ తన వ్యాసంలో.. పురుషులకు నెలసరి వస్తే అది దాచుకోవాల్సిన విషయం కాదు, చాటుకోవాల్సిన గర్వకారణం అయ్యిండేదని అంటారు. యువకులు తమ మొదటి ఋతుస్రావాన్ని మెనార్చే(Men-arche) పేరుతో మతపరమైన వేడుకలు, కుటుంబ విందులతో ఘనంగా జరుపుకునేవారు. నాకు ఐదు రోజుల సైకిల్, నీకెన్ని రోజులు? అని, నా ఫ్లో చాలా హెవీగా ఉంది అని పురుషులు తమలో తాము గొప్పగా చెప్పుకునేవారు. క్రీడల్లో గెలుపొందినప్పుడు నేను నెలసరిలో ఉన్నా కూడా ఈ ఒలింపిక్ పతకం సాధించాను అని గర్వంగా ప్రకటించేవారని ఆమె చెప్పారు.
ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో వెనుకడుగు వేసేవి కావన్నారు. శానిటరీ ఉత్పత్తులన్నీ పూర్తిగా ఉచితం అయ్యేవని తెలిపారు. వాటిపై పరిశోధనల కోసం, మరింత సౌకర్యవంతమైన ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వాలు బిలియన్ల కొద్దీ డాలర్లు కేటాయించేవి. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను గౌరవప్రదమైన గాయంగా పరిగణించి, ఆ సమయంలో పురుషులకు ప్రత్యేక సెలవులు కూడా ఇచ్చేవారని అన్నారు.
అధికారానికి ఆయుధంగా నెలసరి
స్టెయినెమ్ కేవలం సామాజిక మార్పులనే కాకుండా రాజకీయ, మతపరమైన ఆధిపత్యం ఎలా ఉండేదో కూడా ఊహించారు. రాజకీయ నాయకులు, సైన్యాధిపతులు తమ నెలసరిని దేశభక్తికి, త్యాగానికి ప్రతీకగా చూపించేవారని అన్నారు. నెలనెలా దేశం కోసం రక్తాన్ని ధారపోస్తున్న మాకు తెలియదా నాయకత్వం అంటే ఏంటో? అని వాదించేవారని అన్నారు.
మరోవైపు, స్త్రీలను బలహీనులుగా చిత్రించేవారన్నారు. నెలసరి లేని స్త్రీలకు దైవంతో ఎలా అనుసంధానం సాధ్యం? వారికి త్యాగం విలువ ఏం తెలుస్తుంది? అని ప్రశ్నించి, వారిని మత పెద్దలుగా, రాజకీయ నాయకులుగా అనర్హులను చేసేవారన్నారు. అంటే, ఏ లక్షణం అయితే అధికారంలో ఉన్న వర్గానికి ఉంటుందో, అదే గొప్పదిగా, పవిత్రమైనదిగా మార్చబడుతుంది.. అదే లక్షణం లేనివారిని తక్కువ చేసి, అణచివేస్తారన్నారు.

నేటికీ తగ్గలేదు
ఈ వ్యాసం రాసి దాదాపు ఐదు దశాబ్దాలు కావస్తున్నా దాని ప్రాసంగికత నేటికీ తగ్గలేదు, బహుశా మరింత పెరిగిందనే చెప్పాలి. భారతదేశం వంటి దేశాల్లో నేటికీ నెలసరి అనేది ఒక అపవిత్రమైన అంశం. ఆలయ ప్రవేశాలపై ఆంక్షలు, నెలసరి సమయంలో స్త్రీలను అంటరానివారిగా చూడటం, శానిటరీ ప్యాడ్ ల లభ్యత, వాటి ధర వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. కార్యాలయాల్లో పీరియడ్ లీవ్ పై జరుగుతున్న చర్చ కూడా ఈ కోవలోనిదే.
గ్లోరియా స్టెయినెమ్ వ్యాసం కేవలం నెలసరి గురించింది కాదు.. అది అధికారం, పితృస్వామ్యం, సామాజిక కట్టుబాట్లు ఎలా నిర్మించబడతాయో చెప్పే ఒక అద్భుతమైన విశ్లేషణ. ఒక సహజమైన శారీరక ప్రక్రియ ఆధారంగా వివక్ష చూపడం ఎంత హాస్యాస్పదమో ఈ వ్యాసం మన కళ్ళకు కడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications