Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రెడ్ వైన్ తాగుతున్నారా? చచ్చారు పోండి!..డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం
రెడ్ తాగితే మంచి కలర్ వస్తారు..గుండె ఆరోగ్యానికి మంచిది వంటి మాటలు మనం చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అయితే అదొక ప్రమాదకరమైన అపోహ మాత్రమేనని, రెడ్ వైన్ లివర్ కి ఉరితాడు అని మీకు తెలుసా?
రోజూ మద్యం సేవించడం, అది రెడ్ వైన్ అయినా సరే మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కాలేయానికి తీవ్రమైన హాని చేస్తుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, కాలేయ నిపుణుడు డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య (MASLD) ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.

డాక్టర్ సేథి ఇటీవల తన అనుభవంలో ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఒక వ్యక్తి గుండెకు మేలు చేస్తుందని భావించి ఏళ్ల తరబడి రోజూ రెడ్ వైన్ తాగాడు. ఫలితంగా అతని కాలేయం తీవ్రంగా దెబ్బతిని సిర్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు. చివరికి అతను ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కాలేయ మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది.
ఫ్యాటీ లివర్ కు రెడ్ వైన్ ఎందుకు హానికరం?
ఫ్యాటీ లివర్ లేదా MASLD (మెటబాలిక్ డిస్ ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్) సమస్యతో బాధపడేవారికి ఎంత చిన్న మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా అది సురక్షితం కాదని డాక్టర్ సేథి తేల్చిచెబుతున్నారు.
అది ఖరీదైన వైన్ అయినా, చల్లని బీర్ అయినా, కఠినమైన విస్కీ అయినా సరే.. ఆల్కహాల్ కాలేయంలోకి ప్రవేశించగానే దానిపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది.ఇది కాలేయంలో మంట, కొవ్వు పేరుకుపోవడం, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. కాలక్రమేణా ఈ సమస్యలు ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి.
రెడ్ వైన్ లో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ గుండెకు మేలు చేస్తుందంటారు కదా? అనే సందేహం చాలా మందికి రావచ్చు. దీనిపై డాక్టర్ సేథి స్పష్టత ఇస్తూ..రెస్వెరాట్రాల్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్వల్పం. కానీ ఆల్కహాల్ వల్ల కాలేయానికి జరిగే నష్టం మాత్రం కొండంత. ముఖ్యంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న కాలేయానికి ఈ చిన్న ప్రయోజనం కోసం అంత పెద్ద నష్టాన్ని కొనితెచ్చుకోవడం అవివేకం అని వివరిస్తున్నారు.
కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
మద్యానికి స్వస్తి చెప్పండి: కాలేయాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం మద్యపానాన్ని పూర్తిగా మానేయడమే.
సమతుల్య ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయండి.
చెడు అలవాట్లకు దూరం: అతిగా తినడం, జంక్ ఫుడ్, చక్కెరలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications