Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
వయసు పెరిగినా తగ్గని వాల్తేరు వీరయ్య ఎనర్జీ..మెగాస్టార్ చిరంజీవి ఆదర్శవంతమైన డైట్ ప్లాన్!
మెగాస్టార్ చిరంజీవి కేవలం నటనలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. ఆయన ఆహార నియమాలు, క్రమశిక్షణ చూస్తే. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 22తో ఆయనకు 70 ఏళ్లు వస్తాయి. 70 ఏళ్ల వయస్సులో కూడా ఆయనలో శక్తి, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో ఆయన డ్యాన్సులు, ఫైట్లు చూస్తుంటే ఈయన వయసు నిజంగా 70కి చేరిందా అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఎనర్జీ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? కేవలం వ్యాయామం మాత్రమేనా? కాదు.. దాని వెనుక ఓ పక్కా ప్రణాళికతో కూడిన ఆరోగ్యకరమైన ఆహార నియమావళి ఉంది. అద్భుతమైన ఆయన ఫిట్‌నెస్‌కు పునాది వేస్తున్న ఆ డైట్ ప్లాన్ గురించి ఇక్కడ చూడండి.

ఇంట్లో వండిన ఆహారమే అసలైన బలం
చిరంజీవి తన ఆహార విషయంలో అత్యంత క్రమశిక్షణతో ఉంటారు. బయటి ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు ఆయన పూర్తి దూరంగా ఉంటారు. కేవలం ఇంట్లో, తక్కువ నూనెతో, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉంటాయి.
రోజువారీ ఆహార ప్రణాళిక ఇలా
ఉదయం (బ్రేక్‌ఫాస్ట్): రోజును తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్‌ను తీసుకుంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్, శక్తి లభిస్తాయి.
మధ్యాహ్నం (లంచ్): ఆయన భోజనం చాలా సమతుల్యంగా ఉంటుంది. ఒక చిన్న కప్పు బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తో పాటు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన కూరలు ఎక్కువగా తీసుకుంటారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్/చేపలను తింటారు. పెరుగు ఆయన భోజనంలో తప్పనిసరిగా ఉంటుంది.
రాత్రి (డిన్నర్): రాత్రిపూట భోజనం చాలా తేలికగా ఉండేలా చూసుకుంటారు. ఎక్కువగా సూప్ లు, కూరగాయలతో చేసిన సలాడ్లు లేదా గ్రిల్ చేసిన చేప ముక్కలు తీసుకుంటారు. రాత్రి 7:30 గంటలలోపే భోజనం పూర్తి చేయడం ఆయన అలవాటు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై భారం పడకుండా, నిద్ర కూడా బాగా పడుతుంది.
ముఖ్యమైన చిట్కాలు
చిరంజీవి రోజంతా నీటిని ఎక్కువగా తాగుతారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కొవ్వు పదార్థాలు, చక్కెర, మైదాతో చేసిన వంటకాలకు ఆయన వీలైనంత దూరంగా ఉంటారు. తన డైట్ తో పాటు, రోజూ క్రమం తప్పకుండా జిమ్, యోగా వంటి వ్యాయామాలు చేయడం ఆయన ఫిట్‌నెస్ కు మరో ముఖ్య కారణం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications