Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఈ కూరలు తింటున్నారా? కోసిన వెంటనే వండితే తప్పదు భారీ మూల్యం!
మనం వండే ప్రతి కూరలోనూ రుచి, ఆరోగ్యం రెండూ సమపాళ్లలో ఉండాలి. కేవలం ఆయిల్, మసాలాలు తగ్గించడమే కాదు వండటానికి ముందు మనం కూరగాయలను ఎలా సిద్ధం చేస్తామన్న దానిపైనే అసలైన మ్యాజిక్ ఆధారపడి ఉంటుంది. ప్రతి కూరగాయకు ఒక ప్రత్యేకమైన గుణం, ఒక స్వభావం ఉంటుంది. కొన్నింటిని కోసిన వెంటనే వండాలి.. మరికొన్నింటికి కాస్త ఓపిక పడితేనే వాటి అసలైన రుచి బయటకు వస్తుంది. కోసిన వెంటనే వండకూని కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి.
బెండకాయ
బెండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంతో పులుసు, ఫ్రై, పచ్చడి వంటి రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడు బెండకాయ వేపుడు కూర వండితే జిగురుగా మారి, ముద్దగా అవుతోందా? చాలామంది చేసే పొరపాటు ఇదే. బెండకాయలను కోసిన వెంటనే వండకూడదు. వాటిని ముందుగా శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా కోసి ఓ పదిహేను నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. ఈ చిన్న చిట్కాతో జిగురు మాయమై, కూర పొడిపొడిగా, కరకరలాడుతూ వస్తుంది. రుచి కూడా అమోఘంగా ఉంటుంది.

కాలీఫ్లవర్,క్యాబేజీ
మనం కూరలు తయారుచేసుకోడానికి ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో కాలీఫ్లవర్, క్యాబేజీ ముందువరుసలో ఉంటాయి. ఇవి రెండూ చూడటానికి ఎంత అందంగా ఉంటాయో వాటిని శుభ్రం చేయడంలో అంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా సీజన్ కాని కాలంలో వచ్చే కాలీఫ్లవర్ లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వండటానికి ముందు కాలీఫ్లవర్ ను ముక్కలుగా కోసి వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే అందులోని పురుగులు, వాసన పూర్తిగా తొలగిపోతాయి. అలాగే, సన్నగా తరిగిన క్యాబేజీని ఉప్పు, కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిలో కాసేపు నానబెడితే కంటికి కనిపించని పురుగులు కూడా నశించి, కూరగాయ తినడానికి సురక్షితంగా మారుతుంది.
వంకాయ
తెలుగువారికి ఎంతో ఇష్టమైన కూరగాయ వంకాయ. దీనిని వండే రీతిలో వండితే దీన్ని మించిన టేస్ట్ ఏ చికెన్,మటన్ లో కూడా దొరకదు. అంత కమ్మగా ఉంటుంది. అయితే వంకాయను కోసి పక్కన పెడితే క్షణాల్లో నల్లగా మారిపోతుంది. దీనికి కారణం ఆక్సీకరణ ప్రక్రియ. ఇలా నల్లబడిన వంకాయను వండితే కూర రంగు మారడమే కాకుండా కొద్దిగా చేదుగా అనిపించవచ్చు. ఈ సమస్యను నివారించడానికి వంకాయ ముక్కలను కోసిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. వండే ముందు వరకు ఆ నీటిలోనే ఉంచితే వంకాయ రంగు మారదు, చేదు రాదు, పోషకాలు కూడా పదిలంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications