Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే..గుండెపోటు సంకేతమే!
గత కొంతకాలంగా పెద్ద సంఖ్యలో గుండె పోటు మరణాలు ముఖ్యంగా యువతలో పెరిగిపోవడం సమాజాన్ని కలవరపెడుతోంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తుంటే, అదే ప్రాణానికి ముప్పుగా మారుతున్న ఘటనలు మనల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిమ్ చేస్తూ లేదా వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించిన ఘటనలు కూడా తరచుగా చూస్తున్నాం. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు వ్యాయామం చేయడం మంచిదేనా? లేక అదే గుండెపోటుకు కారణమవుతోందా? అనే భయంకరమైన సందేహం చాలా మందిలో మెదులుతోంది.
నిజానికి వ్యాయామం గుండెకు శత్రువు కాదు కానీ మన శరీరం అనే యంత్రం ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్ని హెచ్చరిక గంటలను మోగిస్తుంది. ఆ సంకేతాలను మనం పెడచెవిన పెట్టినప్పుడే అసలు ప్రమాదం పొంచి ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మీ శరీరం పంపించే కొన్ని సంకేతాలను పంపిస్తే, వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దు. అవి రాబోయే గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలు కావచ్చు.

ఈ సంకేతాలను లైట్ తీసుకోవద్దు
అకస్మాత్తుగా కళ్ళు బైర్లు కమ్మడం
వ్యాయామం మధ్యలో ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్మడం, తల గిర్రున తిరుగుతున్నట్లు అనిపించడం చాలా ప్రమాదకరమైన సంకేతం. గుండెకు తగినంత ఆక్సిజన్, రక్తం అందనప్పుడు, మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. దీని ఫలితమే ఈ తలతిరగడం. ఇది అప్పుడప్పుడు వస్తే ఫర్వాలేదు కానీ తరచుగా ఇలా జరుగుతుంటే మీ గుండె ప్రమాదంలో ఉందని అర్థం.
ఊహించని రీతిలో ఆయాసం, శ్వాస అందకపోవడం
వ్యాయామం చేస్తే ఆయాసం రావడం సహజం. అయితే మీరు తేలికపాటి వ్యాయామం చేస్తున్నా కూడా ఊపిరి అందనట్లు, గొంతులో ఏదో అడ్డం పడినట్లు, ఛాతీపై బరువు పెట్టినట్లు అనిపిస్తే అది సాధారణ ఆయాసం కాదు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై భారం పడి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుండె బలహీనపడుతోందనడానికి స్పష్టమైన సూచన.
అంతుచిక్కని తీవ్రమైన నీరసం
ఎలాంటి కఠినమైన శారీరక శ్రమ చేయకపోయినా, ఒక్కసారిగా శరీరం శక్తిని కోల్పోయి, కనీసం నిలబడటానికి కూడా ఓపిక లేనంతగా నీరసించిపోవడం గుండెపోటుకు ముందు కనిపించే ఒక ముఖ్య లక్షణం. గుండెపోటు వచ్చిన చాలా మంది తమ అనుభవంలో ఈ లక్షణాన్ని ప్రధానంగా చెప్పారు. మీలో అకస్మాత్తుగా ఇంతటి బలహీనత కనిపిస్తే, అది మీ గుండె వేస్తున్న ఆర్తనాదం కావచ్చు.

చల్లగా, జిగటగా ఉండే విపరీతమైన చెమట
వ్యాయామం చేస్తే చెమట పట్టడం సహజం. కానీ చల్లగా, జిగటగా ఉండే చెమట, కారణం లేకుండానే శరీరం మొత్తం తడిసిపోయేంతగా పట్టడం ప్రమాద సంకేతం. మీ గుండె రక్తాన్ని పంప్ చేయడానికి విపరీతంగా కష్టపడుతున్నప్పుడు శరీరం ఇలా స్పందిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితికి సూచన.
ఛాతీ నుండి చేయి, భుజం, దవడకు పాకే నొప్పి
గుండెపోటు అనగానే ఛాతీలో భరించలేని నొప్పి వస్తుందని అందరికీ తెలుసు. కానీ, ఆ నొప్పి అక్కడే ఆగదు. ఛాతీ మధ్యభాగం నుండి మొదలై, ఎడమ చేయి, భుజం, మెడ, దవడ లేదా వీపు వైపు పాకుతున్నట్లు అనిపిస్తే, అది గుండెపోటు విలక్షణమైన లక్షణం. ఈ నొప్పిని సాధారణ నొప్పని భ్రమపడవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications