Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్రోకలీతో ప్రాణాలకే ముప్పు! ఇటలీలో పెను విషాదం.. అసలు నిజం తెలిస్తే షాక్!
ఆరోగ్యం కోసం మనం ఎంతో నమ్మకంతో తినే ఆహారమే మన ప్రాణాలకు ముప్పుగా మారితే? వినడానికి భయంగా ఉన్నా, ఇటలీలో ఇదే నిజమైంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడే సూపర్ ఫుడ్ బ్రోకలీ ఇప్పుడు అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది. ఈ బ్రోకలీ కారణంగా వ్యాపించిన ఒక భయంకరమైన వ్యాధికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వార్త ఆరోగ్య ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఏం జరిగింది?
ఇటలీలోని కాలాబ్రియా ప్రాంతంలో ఒక వ్యక్తి బ్రోకలీ, సాసేజ్‌తో చేసిన శాండ్ విచ్ కొని తిన్నాడు. తిన్న కొద్దిసేపటికే అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం మొదలైంది. ఇంటికి కారులో తిరిగి వెళ్తుండగా పరిస్థితి విషమించి, కి చేరేలోపే ప్రాణాలు విడిచాడు. అదే శాండ్ విచ్ తిన్న మిగిలిన వారు కూడా తీవ్ర అస్వస్థతకు గురై, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత నెలలో కూడా ఇటలీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనను మరింత పెంచుతోంది. దీంతో స్థానిక యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రస్తుతానికి బ్రోకలీ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రాణాలు తీస్తున్న 'బోటులిజం'
ఇంతకీ ఈ మరణాలకు కారణమైన వ్యాధి ఏమిటి? దాని పేరు 'బోటులిజం'. ఇది క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే అత్యంత ప్రమాదకరమైన విషపదార్థం వల్ల వస్తుంది. ఇది నేరుగా మన నాడీ వ్యవస్థపై దాడి చేసి, నరాల మధ్య సమాచార ప్రసారాన్ని నిలిపివేస్తుంది. ఫలితంగా కండరాలు పనిచేయడం ఆగిపోయి, పక్షవాతం వస్తుంది. సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే, శ్వాస వ్యవస్థ కూడా స్తంభించిపోయి మరణం సంభవిస్తుంది.
ఆరోగ్యకరమైన బ్రోకలీ విషంగా ఎలా మారింది?
ఆరోగ్యకరమైన బ్రోకలీ ప్రాణాంతకంగా ఎలా మారిందనేదే ఇక్కడ అసలు ప్రశ్న. నిపుణుల ప్రకారం..ఇటలీలో సాంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే ఆహార పదార్థాలను నిల్వ చేసే అలవాటు ఎక్కువ. ముఖ్యంగా బ్రోకలీ, పుట్టగొడుగులు, బీన్స్ వంటి తక్కువ ఆమ్ల గుణం ఉన్న కూరగాయలను నూనెలో ఊరబెట్టి నిల్వ చేస్తారు. ఇలా చేసేటప్పుడు సరైన ఉష్ణోగ్రతలో వాటిని స్టెరిలైజ్ (క్రిమిరహితం) చేయకపోతే, ఆక్సిజన్ లేని ఆ నూనె వాతావరణం క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా పెరగడానికి స్వర్గధామంలా మారుతుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషం చాలా శక్తివంతమైనది. కంటికి కనిపించని అతి తక్కువ మోతాదులో ఉన్నా అది మనిషి ప్రాణాలను తీయగలదు.
ఆహారం ఎంత ఆరోగ్యకరమైనదైనా, దానిని నిల్వ చేసే పద్ధతి తప్పుగా ఉంటే అది ప్రాణాంతక విషంగా మారగలదు. అందుకే ఇంట్లో తయారుచేసి, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన, ముఖ్యంగా నూనెలో ఊరబెట్టిన ఆహార పదార్థాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications