Latest Updates
-
కర్కాటకంలో గురుడి సంచారం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం, సంపద వెల్లువ! -
ధనుస్సు, మీన రాశుల వారికి అద్భుత యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 03 జూన్ 2026 -
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి!
గుండె వణుకు పుట్టించే నిజం..సరైన నిద్ర లేకపోతే షుగర్ గ్యారంటీ!
షుగర్ లేదా డయాబెటిస్ పేరు వింటేనే చలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే దీనిని కంట్రోల్ చేయగలం తప్ప పూర్తిగా నయం చేసే మెడిసన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మనదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. అయితే డయాబెటిస్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేవి తీపి ఆహారాలకు దూరం, రోజూ వాడే మెడిసిన్స్, కఠినమైన ఆహార నియమాలు.
కానీ ఈ షుగర్ వ్యాధి వెనుక మనం ఊహించని మరో పెద్ద కారణం దాగి ఉందని మీకు తెలుసా? కేవలం ఆహారం, ఊబకాయం మాత్రమే కాదండోయ్ మన నిద్ర కూడా మన రక్తంలో షుగర్ లెవల్స్ ను శాసిస్తుందని ఇటీవలి పరిశోధనలు తేల్చిచెబుతున్నాయి.

అసలేమిటీ మధుమేహం? ఎందుకింత ప్రమాదకరం?
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ఈ యంత్రం సక్రమంగా పనిచేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా కీలకం. ఇది మనం తీసుకున్న ఆహారంలోని చక్కెరను శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ వచ్చినప్పుడు ఈ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం జరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర పేరుకుపోయి, అది నెమ్మదిగా మన శరీరంలోని ఒక్కో అవయవాన్ని దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
ఒకసారి డయాబెటిస్ కంట్రోల్ తప్పితే అది మన శరీరాన్ని నెమ్మదిగా తినేసే ఒక సైలెంట్ కిల్లర్ గా మారుతుంది. ఇది కంటిచూపును మసకబార్చగలదు, మూత్రపిండాలను విఫలం చేయగలదు, నరాలను బలహీనపరిచి స్పర్శను కోల్పోయేలా చేస్తుంది.అంతటితో ఆగకుండా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి మాటిమాటికీ ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. అందుకే దీన్ని కేవలం షుగర్ వ్యాధిగా తేలిగ్గా తీసుకోకూడదు.
నిద్రకు, షుగర్‌కు ఉన్న సంబంధం ఏమిటి?
సాధారణంగా మనం బరువు, ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి వాటినే డయాబెటిస్ కి కారణాలుగా భావిస్తాం. కానీ హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులు మనందరినీ ఆశ్చర్యపరిచే ఒక నిజాన్ని బయటపెట్టారు. అదే నిద్ర లేమి. మనం నిద్రపోనప్పుడు మన శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ హార్మోన్, ఇన్సులిన్ పనితీరుకు అడ్డుపడుతుంది.
అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు కూడా దెబ్బతింటాయి, ఫలితంగా అనారోగ్యకరమైన ఆహారంపైకి మనసు మళ్లుతుంది. ఈ మార్పులన్నీ కలిసి, శరీరం చక్కెరను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేసి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు సన్నగా, ఫిట్ గా ఉన్నప్పటికీ, సరైన నిద్ర లేకపోతే ఈ ప్రమాదం పొంచి ఉంది.

జీవనశైలిలో చిన్న మార్పులతో సులభంగా అధిగమించవచ్చు
-ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్రను అలవాటు చేసుకోండి.
-రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి.
-నిద్రకు గంట ముందు నుంచే ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి.
-రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
-సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి.
-ధ్యానం, యోగా వంటివి దినచర్యలో భాగం చేసుకుని ఒత్తిడిని జయించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications