Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Herbal Drinks : ఈ హెర్బల్ డ్రింక్స్ తాగితే.. గుండె పోటుకు చెక్ పెట్టినట్టే..!
ఆయుర్వేదం మనకు ఎన్నో అందించింది. ఆరోగ్యం విషయంలో ప్రపంచంలో మనము అందరికంటే ఒక అడుగు ముందు ఉన్నామంటే అది ఆయుర్వేదం వల్లే. ఇప్పుడు చెప్పబడే సర్జరీని శుష్రుడు ఆ కాలంలోనే చేశాడు. దాన్నే మనము శుష్ర శస్త్ర చికిత్స అంటాము. ఈ ఎండాకాలంలో వడదెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి బయట దొరికే కూల్‌డ్రింక్స్ కాకుండా మనమే స్వంతంగా తయారుచేసుకోగల హర్బల్ డ్రింక్స్‌ను తాగుదాము. ఈ హర్బల్ పానియాల వల్ల గుండె నాళాలు ఏవైనా బ్లాక్ అయితే అవి విడుదలౌతాయ్.
త్రిఫల టీ
పరిగడపున ఈ త్రిఫల టీని తాగాలి. త్రిఫల అంటే మూడు పళ్ల సమ్మేళనం. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని ప్రతీ రోజు తాగాలి. దీని వల్ల గుండెకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యమైన తగ్గే అవకాశం వుంటుంది. టీ చేసేప్పుడు ఎలాగైతే టీ పొడి వేసుకుంటామో అలాగే దానికి బదులుగా ఈ త్రిఫల చూర్ణం వేసుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల విషపదార్ధాలు శరీరం నుంచి బయటకు వెళ్లడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలో కొవ్వు పదార్ధం ఉంటే కూడా కరిగి పోతుంది.

నిమ్మ అల్లం టీ
దీనిని అద్రక్ చాయ్ అని కూడా అంటాము. వేడి నీళ్లల్లో కొంచం అల్లం వేసి అందులో కొంత నిమ్మకాయ పిండుకొని తాగితే శరీరానికి చాలా మంచింది. ఈ వేసవిలో బ్లడ్ ప్రెజర్ రాకుండా చేసి రక్తనాళాలు కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తాయ్. వైటమిన్ సి సంమృద్ధిగా ఉండడంతో గాయాలు కూడా త్వరగా మానుతాయ్.
దాల్చిన చెక్క టీ
మరో ఆరోగ్యవంతమైన పానియం దాల్చిన చెక్క టీ. దాల్చిన చెక్క చాలా ఘాటుగా వుంటుంది. ఒక కప్పు వేడి నీళ్లల్లో దాల్చిన చెక్క వేసుకొని కలుపుకొని తాగితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. షుగర్ లెవెల్స్ కూడా అదుపులోకి వస్తాయ్. కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఏవి ఉన్నా కూడా వాటిని తగ్గించేందుకు ఈ దాల్చిన చెక్క టీ సహాయపడుతుంది.
తులసి టీ
తులసి ఆకులను చాలా పవిత్రంగా భావిస్తారు. తులసిలో చాలా ఔషద గుణాలుంటాయ్. వేడి నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె నాళాల్లో ఏవైనా బ్లాకేజ్‌లు ఉంటే క్లీయర్ అయిపోతాయ్. మానసిక ఒత్తిడిని తగ్గించే శక్తి కూడా ఈ తులసి టీకి వుంది.
అల్లం పాలు
ఒక గ్లాసు పాల్లో అల్లం కలుపుకొని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయ్. గోరువెచ్చని పాలల్లో అల్లం వేసుకోవడం వల్ల కొవ్వు శాతం తగ్గడమే కాకుండా గుండె రక్త నాళాల్లో ఏవైనా బ్లాకేజ్‌లు వుంటే క్లీయర్ చేస్తుంది.
అర్జున బార్క్ టీ
ఆయుర్వేదంలో అర్జునా బార్క్ టీకి ప్రాముఖ్యత ఎక్కువగా వుంది. అర్జున చెట్టుకు ఉన్న బెరడుతో వచ్చిన పొడిని టీగా చేసుకొని తాగితే కొవ్వు తగ్గడమే కాకుండా గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ కాకుండా క్లీయర్ అవుతాయ్.
పైన ఇచ్చిన హెర్బల్ టీలలో ఏదైనా ఒక దానిని రోజూ తాగడానికి అలవాటు చేసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులున్న వారు భయపడాల్సిన అవసరం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications