Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
నల్ల మచ్చలున్న ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే ఒక సామెత ఉంది. ఉల్లిపాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇవి తినటం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇది గుండెకు కూడా మేలు చేస్తు్ంది..జుట్టుకు,అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. మన వంటగదుల్లో ఏది ఉన్నా లేకున్నా ఉల్లిపాయ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. పేదవాడింట్లో అయినా లేదా ధనవంతుడి వంటింట్లో అయినా ఎక్కడైనా ఉల్లిపాయ ఖచ్చితంగా ఉంటుంది.
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ పాత్ర చాలా ముఖ్యమైనది. ఉల్లిపాయ లేకుండా ఏ వెజ్ కూర అయినా, చికెన్ అయినా , మటన్ అయినా రుచి సరిగ్గా ఉండదు. ఉల్లిపాయలు ఆహారానికి రుచితో పాటు మంచి వాసన కూడా అందిస్తుంది. అయితే మార్కెట్ నుంచి లేదా షాపు నుంచి ఉల్లిపాయలను కొని తెచ్చుకున్న తర్వాత వాటిని కట్ చేసే సమయంలో వాటిపై నలుపు,దుమ్ములాంటి పొడి మచ్చలు ఉండటం మనం చాలా సందర్భాల్లో గమనించి ఉంటాం. అలా నచ్చమచ్చలు ఉండటం చూసి కొందరు అయితే ఆ ఉల్లిపాయను పడేస్తుంటారు..మరికొందరు అయితే అలాంటి ఉల్లిపాయల తొక్క తీసేసి వాటిని ఉపయోగిస్తుంటారు. అయితే అసలు నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?..ఈ మచ్చల ఉల్లిని తినాలా? పారవేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇక్కడ చూడండి.

నల్ల మచ్చలకు కారణం ఇదే
ఉల్లిపాయలపై నల్ల మచ్చలుంటే అది ఆస్పెర్‌గిల్లస్ నైజర్ అనే ఫంగస్ వల్ల కారణమై ఉండవచ్చు. ఈ రకమైన ఫంగస్ నేలలో కనిపిస్తుంది. ఉల్లిపాయలను సంచులు లేదా మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేసినప్పుడు, గాలి సరిగ్గా లేని ప్రదేశాలలో, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో నిల్వ చేస్తే ఈ ఫంగస్ అభివృద్ధి చెందుతుంది. ఫంగస్ బయటి పొరపై పెరగడం ప్రారంభమవుతుంది. ఇది నల్లటి పొడి అవశేషాలను సృష్టిస్తుంది. ఉల్లిపాయ బయటి చర్మం దెబ్బతిన్నట్లయితే నల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫంగస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు.
తినడానికి సురక్షితమేనా?
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయలపై ఉన్న ఈ నల్ల మచ్చలు వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తదు. అటువంటి ఉల్లిపాయలను శుభ్రం చేసి, ఫంగల్ పొరను తొలగించడం ద్వారా ఉపయోగించవచ్చు. అటువంటి ఉల్లిపాయలను వండడానికి ముందు వాటిని తొక్క తీసి బాగా కడగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదని అధ్యయనాలు చెబుతున్నాయి.
వారికి మాత్రం
నల్ల మచ్చలున్న ఉల్లిపాయ చాలా హానికరం కానప్పటికీ ఈ నల్లటి శిలీంధ్రం ఒక రకమైన విషాన్ని విడుదల చేస్తుందని అధ్యయనాలు కూడా చూపించాయి. రోగనిరోధక శక్తి, ఉబ్బసం లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. అలెర్జీలు, శ్వాస సమస్యలతో బాధపడేవారు ఈ రకమైన ఉల్లిపాయలను తిన్న తర్వాత మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారంట. అందువల్ల అటువంటి సమస్య ఉన్నవారు వీలైనంత వరకు నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తినకుండా ఉంటేనే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
