Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గింజల కంటే తొక్కలోనే ఎక్కువ బలమా? దానిమ్మ తొక్క టీ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు
సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్లినప్పుడు మన ఆరోగ్యానికి మేలు చేసేవి తక్కువ ధరకు లభిస్తుంటాయి, మన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి ఎక్కువ ధరకు అమ్ముతున్నా చాలామంది ఎక్కువ ధరవే కొంటుంటారు. మనదేశంలో చిన్నవయస్సు నుంచే చాలామంది అనేక రకాల వ్యాధుల బారిన పడటానికి ఇదొక ప్రధాన కారణం.
తక్కువ ధరకు లభించి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే వాటిలో దానిమ్మ అగ్రస్థానంలో ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నవారికైనా, బలహీనంగా ఉన్నవారికైనా డాక్టర్లు సూచించే మొదటి పండు దానిమ్మే. సాధారణంగా మనం దానిమ్మ తొక్కను డస్ట్ బిన్ లో పారేస్తుంటాం. కానీ దానిమ్మ గింజల కంటే దాని తొక్కలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఈ తొక్కను నీటిలో మరిగించి హెర్బల్ టీలాగా తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ తొక్క కషాయం లేదా టీ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు
జీర్ణ సమస్యలకు సంజీవని
దానిమ్మ తొక్కలో ఉండే శక్తివంతమైన ఆస్ట్రిజెంట్ లక్షణాలు జీర్ణవ్యవస్థకు ఒక వరంలా పనిచేస్తాయి. ఇది కడుపులోని మంటను తగ్గించడమే కాకుండా విరేచనాలు అయినప్పుడు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిని మరిగించి తాగడం వల్ల కడుపులోని హానికరమైన పురుగులు నశించిపోతాయి.
గుండెకు రక్షణ కవచం
దానిమ్మ తొక్కలో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్లు రక్త ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి, గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
గొంతు నొప్పి,దగ్గుకు దివ్యౌషధం
వాతావరణం మారినప్పుడల్లా వచ్చే గొంతు నొప్పి, టాన్సిల్స్ లేదా పొడి దగ్గు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే దానిమ్మ తొక్కలను నీటిలో మరిగించి, ఆ గోరువెచ్చని నీటితో పుక్కిలించండి . ఇది గొంతులోని హానికర బ్యాక్టీరియాను చంపి, మంట నుండి తక్షణమే ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరాన్ని శుద్ధి చేసే డీటాక్స్ డ్రింక్
మనం తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా ఎన్నో విష పదార్థాలు శరీరంలో చేరుతుంటాయి. దానిమ్మ తొక్కల నీరు ఒక గొప్ప డీటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. ఇది లివర్, కిడ్నీలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు చెక్
ఏం చేసినా నోటి దుర్వాసన పోవడం లేదా? చిగుళ్ల నుండి రక్తం కారుతోందా? అయితే దానిమ్మ తొక్కల నీరు మీకు బెస్ట్ మౌత్ వాష్. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని క్రిములను చంపి, చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. ఈ నీటితో తరచుగా పుక్కిలిస్తే దంత సమస్యలు దరిచేరవు.
ఉక్కులాంటి ఎముకల కోసం
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజం. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్ దశ తర్వాత ఎముకల సాంద్రత తగ్గుతుంది. దానిమ్మ తొక్క సారం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుందని, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తయారీ విధానం
దానిమ్మ తొక్కలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు రంగు మారిన తర్వాత వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. లేదా తొక్కలను ఎండబెట్టి పొడి చేసి కూడా నిల్వ చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications