Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ముక్క ముట్టని బాలీవుడ్ స్టార్స్ వీళ్లే!..ఆరోగ్యం కోసం వీళ్లు ఏం తింటారో చూడండి
ఈ రోజుల్లో చాలామంది తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఆరోగ్యం ఉంటే చాలు అదే 100 కోట్లు అనుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచే ఎక్కువగా ఈ సృహ జనాల్లో ఎక్కువగా వచ్చింది. అయితే ఫుడ్ విషయంలో చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీరు నిత్యం టీవీల్లో,సోషల్ మీడియాలో,వెండితెరపై చూసే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పూర్తిగా శాఖాహారులు. ఏయే బాలీవుడ్ సెలబ్రిటీలు పూర్తిగా శాఖాహారమే తింటున్నారో ఇక్కడ చూడండి.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి తెలియనివారుండరు. 82 ఏళ్లు వచ్చినా కూడా ఆయన ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. కుర్రహీరోలతో పోటీపడి మరీ సినిమిల్లో ఇంకా నటిస్తున్నారు. అయితే ఈ వయస్సులో కూడా ఆయన ధృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే ఆహారమే. అమితాబ్ బచ్చన్ చాలాకాలం నుంచి శాఖాహారిగా ఉన్న అమితాబ్..తన ఆరోగ్యం, శక్తికి మొక్కల ఆధారిత ఆహారమే కారణమని తరచుగా చెబుతుంటారు. ఆయన ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ ఉదయం పూట పండ్లు, డ్రై ఫ్రూట్స్..మధ్యాహ్నం భోజనంలో పప్పు, కూరగాయలు, రోటీలు..రాత్రి భోజనంలో సూప్, పనీర్ భుర్జీ వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటారు.

కంగనా రనౌత్
బాలీవుడ్ లో క్వీన్ గా తనదైన ముద్ర వేసుకున్న కంగనా రనౌత్ పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. పోటీచేసిన తొలిసారే ఎంనీగా గెలిచారు. కంగనా తన అందం, ఆరోగ్యీనికి శాఖాహారమే కారణమని చెబుతున్నారు. కంగనా రనౌత్ మాంసం, పాల ఉత్పత్తులను పూర్తిగా వదిలేసింది. సంపూర్ణ శాకాహార లైఫ్ స్టైయిల్ ని కంగనా ఎంచుకుంి. తన మెరిసే చర్మం, మానసిక స్పష్టతకు శుభ్రమైన ఆహారమే కారణమని ఆమె తరచుగా చెబుతుంటారు. ఆమె ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటారు.
సోమమ్ కపూర్
ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న సోనమ్ కపూర్..ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఆరోగ్యం, నైతిక కారణాల వల్ల సోనమ్ శాకాహారాన్ని స్వీకరించింది. ఫ్యాషన్ సెన్స్ ఉన్న సోనమ్..జంతుహింసకు వ్యతిరేకం. మొక్కల ఆధారిత ఆహార బ్రాండ్లు, జీవనశైలి మార్పులను సోనమ్ ప్రోత్సహిస్తుంది. సోనమ్.. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటారు.
షిహిద్ కపూర్
బాలీవుడ్ లో తనదైన శైలితో దూసుకుపోతున్నాడు షాహిద్ కపూర్. ఆయన ఫిట్ నెస్, చురుకుదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, షాహిద్ కపూర్ శాకాహారి అని చాలామందికి తెలియదు. "లైఫ్ ఈజ్ ఫెయిర్" అనే పుస్తకం చదివిన తర్వాత ఆయన శాకాహారిగా మారారు. అహింస యొక్క ఆధ్యాత్మిక అంశాల నుండి ప్రేరణ పొందిన ఆయన, సంవత్సరాలుగా శాకాహారిగానే ఉంటున్నారు. మాంసం లేని జీవితం కూడా అధిక శక్తిని ఇస్తుందని ఆయన నిరూపించారు.
జాన్ అబ్రహం
బాలీవుడ్ లో కండల వీరుడిగా పేరుపొందిన జాన్ అబ్రహం శాకాహారి అని చాలామందికి తెలియదు. మాంసం లేకుండా కూడా కండలు పెంచడం సాధ్యమేనని ఆయన నిరూపించారు. జాన్ అబ్రహం తన ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన ఆహారపు అలవాట్లు, జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. ఆయన ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా ఉంటాయి.
అలియా భట్
తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటున్న అలియాభట్ శాకాహారి అని చాలామందికి తెలియదు. పర్యావరణ పరిరక్షణ, ఫ్యాషన్ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన అలియా ఆహారంలో పండ్లు,కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. ఆమెకు ఇష్టమైన ఆహారం దాల్ చావల్ మరియు స్పఘెట్టి. ఆమె తరచుగా ఈ ఆహారాలను తీసుకుంటారు. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటారు.
తమన్నా భాటియా
హీరోయిన్ తమన్నా గతంలో మాంసాహారి అయినప్పటికి ఆమె పెంపుడు కుక్క తీవ్రమైన పక్షవాతానికి గురై అనారోగ్యంతో మరణించింది. గతంలో చికెన్ బిర్యానీ అంటే తమన్నాకు చాలా ఇష్టంగా ఉండేది. అయితే తన కుక్క మరణించిన తర్వాత నుంచి నాన్ వెజ్ తినడం మానేసి పూర్తిగా శాకాహారిగా తమన్నా మారిపోయింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications