Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Compulsory Medical Tests : ఈ 8 పరీక్షలను ఖచ్ఛితంగా చేయించుకోవాలి..!
ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో వున్న అందరూ ఆరోగ్యంగా ఉంటారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డకూడా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యంపైనే చాలా మంది ఆరోగ్యం జీవితం ఆధారపడి ఉంది. ప్రస్తుతం దేశంలో మహిళలు కొన్ని ప్రాణాంతక వ్యాధులకు గురౌతున్నారు. ఇప్పటికే ఎనేమియా శాతం ఎక్కువగా ఉండడం ఇతర అనారోగ్య సమస్యలు మళ్లీ చుట్టుముడుతుండడం మహిళల ఆరోగ్యాన్ని సంకటంలో పడేస్తోంది. అయితే కొందరు మహిళలు డైట్ పాటిస్తున్న, ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తున్నా వారు ఖచ్చితంగా కొన్ని మెడికల్ పరీక్షలను చేయించుకోవాలి. వ్యాధి తీవ్రమవకముందు జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
30 ఏళ్ల వయసు అంతకన్నా ఎక్కువగా ఉన్న మహిళలు ఖచ్ఛితంగా ఈ కింది 8 రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలి. వీటిని ఎట్టిపరిస్థితుల్లో మిస్ చేయకూడదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు ఖచ్ఛితంగా చేయించుకోవాల్సిన 8 రకాల మెడికల్ టెస్టులు
పాప్ స్మీయర్ మరియు హెచ్‌పీవీ పరీక్ష
ఇటీవల సర్వికల్ క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయ్. ఆ క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డానికి పాప్‌స్మీయర్ టెస్ట్‌ను చేయించుకోవాలి. 30 ఏళ్ల పైబడిన మహిళలు ప్రతీ ఐదేళ్లకోసారి ఈ పరీక్షను చేయించుకోవాలి. ఈ రెండు టెస్టులూ శరీరంలో సర్వికల్ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలు ఎవైనా ఉంటే వాటిని గుర్తిస్తుంది. దీంతో పరిస్థితి తీవ్రం కాకముందే వైద్య చికిత్స చేసుకొనే అవకాశం ఉంది.
బోన్ డెన్సిటీ పరీక్ష
ఎముకలు బలంగా ఉన్నాయా లేదా వాటికి సంబంధించి ఏవైనా సమస్యలున్నాయా తెలుసుకోవడానికి బోన్ డెన్సిటీ పరీక్ష లేదా డెక్సా స్కాన్‌ను చేయించుకోవాలి. యముకలు బలహీనంగా ఉంటే ఆస్టియేపొరోసిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారిస్తారు. శరీర బరువు చాలా తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా ఈ ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

కొలెస్ట్రాల్ టెస్ట్
గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ స్థాయిలను తెలుసుకునేందుకు పరీక్షను చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండ సమస్యలు వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి గుండె పోటు సమస్యలను నివారించడానికి ఈ టెస్ట్‌ను ఖచ్చితంగా చేయించుకోవాలి.
బ్లడ్ షుగర్ టెస్ట్
30 ఏళ్లు పై బడిన మహిళలు తరచుగా ఈ బ్లడ్ షుగర్ టెస్ట్‌ను ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే మధుమేహానికి గురికావలసి వస్తుంది. పరీస్థితి తీవ్రం కాకముందే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
థైరాయిడ్ టెస్ట్
పురుషుల్లో కన్నా మహిళల్లోనే థయ్‌రాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయ్. తీవ్రమైన అలసట, బరువులో తరచుగా మార్పులు రావడం, మూడ్ కూడా మారుతూ ఉండడం లాంటి లక్షణాలు కనిసిస్తే వెంటనే థైరాయిడ్ పరీక్షను చేయించుకోవాలి.
మామోగ్రామ్
ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను ఎక్కువగా చూస్తున్నాం. మామోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించిన విషయాలు బయటపడతాయ్. 40 ఏళ్లు పైబడిన మహిళలు సంవత్సరానికి ఓసారి మామోగ్రామ్ పరీక్షణు తప్పకుండా చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంబంలోనే గుర్తిస్తే సులభంగా నివారించే అవకాశం ఉంటుంది.
బ్లడ్ ప్రెజర్ టెస్ట్
బ్లడ్ ప్రెజర్ టెస్ట్‌ను కూడా మహిళలు సంవత్సరానికి ఓసారి చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు లేదా బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండే హైపర్‌టెన్షన్ సమస్యకు గురై గుండె వ్యాధుల బారిన పడే అవకాశముంది. రక్తపోటు ఎక్కువైతే గుండె పోటు కూడా వచ్చే పరిస్థితి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంట్లోనే చిన్న బ్లడ్ ప్రెజర్ పరికరంతో ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి.
కోలోరెక్టల్ క్యాన్సర్
50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కొలొనోస్కొపీ, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్‌ఓబీటీ) ద్వారా ఈ కొలొరెక్టల్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ బారినుంచి త్వరగా బయటపడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications