Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొరియన్లలా ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే.. ఈ కొరియన్ అలవాట్లను అలవర్చుకోవాల్సిందే..!
ప్రపంచంలో కొందరు చూడటానికి చాలా భిన్నంగా వుంటారు. వారి చర్మం, వెంట్రుకలు, శరీరాకృతి ఇతరుల కంటే కొంత భిన్నంగా వుంటుంది. ఆఫ్రికా ప్రజల జుట్టు, చర్మం రంగు ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా వుంటుంది. ఐతే కొన్ని ప్రాంతాల ప్రజలు చూడటానికి చాలా ఆకర్షనియంగా వుంటారు. వారి ఆహార అలవాట్లు, సంస్కృతితే ఇందుకు కారణం. కొరియాకు చెందిన ప్రజల స్కిన్ టోన్ కాంతివంతంగా ఆరోగ్యంగా కనబడుతుంది. వారి వెంట్రుకలు కూడా చాలా ఆరోగ్యంగా వత్తుగా ఉంటాయ్. దీనంతటికీ కారణం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు, వారు రోజూ వారి అలవాట్లు కూడా. వారి తినే ఆహారాన్ని మనమూ తినడం వల్ల మనకూ వారిలాంటి ఆరోగ్యకరమైన కాంతివంతమైన చర్మం వస్తుందా అంటే ఓననే అంటున్నారు పరిశోధకులు. మరి కొరియన్ ప్రజల ఆహార అలవాట్లు ఎలా వున్నాయ్, ప్రతి రోజూ వారి నిత్యజీవితం ఎలా గడుస్తుంది. వీటిని మన లైఫ్‌స్టైల్ (జీవన విధానం)లో భాగం చేసుకుంటే మనకూ అలాంటి లక్షణాలు కాలుగుతాయొమో ప్రయత్నించి చూద్దాం.
నీరు తాగడం
కొరియన్లు తమను తాము రోజంతా హైడ్రేటెడ్‌గా వుంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగుతారు. ఉదయం లేవగానే కనీసం అరలీటరు నీరు తాగడం వల్ల కడుపులో వున్న బ్యాక్టీరియా, విషపు పదార్ధాలను బయటకు పంపించి వేయవచ్చు. ఆరోగ్యంగా వుండాలంటే ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరును తప్పకుండా తీసుకోవాలి.
ఆహారపు అలవాట్లు
కొరియన్లు తినే ఆహార పదార్థల్లో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలాంగా ఉంటాయ్. వారు తరచుగా వండుకునే కించి కూర, సముద్రం వద్ద దొరికే ఆకుకూరాలతో చేసుకునే కూర, గ్రీన్ టీ లాంటి వంటకాలే ఇందుకు నిదర్శనం.

కొరియన్ల చర్మ రహస్యం
ఎండ నుండి వారి చర్మాన్ని కాపాడుకోవడమానేది వారి సంస్కృతిలో భాగమైపోయింది. అందుకే వారికి వాతావరణంతో సంబంధ లేకుండా ప్రతీ రోజు సన్ స్క్రీన్ లోషన్ ను చర్మానికి రాసుకుంటారు. కొరియన్లు తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతీ రోజు వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. కరాటే, టైక్వాండో, కొరియన్ పాప్ డాన్స్, ఇలా ఏదో ఒకటి చేసి తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు.
మానసిక ఒత్తడి, చికిత్స
మానసిక ఒత్తడిని మెడిటేషన్ చేయడం ద్వారా తగ్గించుకుంటారు. ప్రకృతితో ఎక్కువ గడపడానికి ప్రయత్నిస్తారు. చికిత్సకు సంబంధించిన అంశాల్లో కొరియన్లు ఎక్కువగా హెర్బల్ ఔషదాలనే ఉపయోగిస్తారు. ఫార్మా మందులను తక్కువగా వాడతారు.
నిద్రకు ప్రాముఖ్యత
నిద్రకు కూడా కొరియన్లు ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి రోజూ కంటినిండా నిద్రపోతారు. ఇది కూడా వారు ఆరోగ్యంగా ఉండడాలనిక శరీరం, చర్మం నిగనిగలాడటానికి కారణంగా చెప్పుకోవచ్చు. మెదడు చురుగ్గా పనిచేయాలన్నా శరీరంలో మెటబాలిజమ్ సక్రమంగా జరగాలన్ని ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
భోజనానికి ప్రాధాన్యత
కొరియన్లు కడుపు నిండా భోజనం చేస్తారు. తమకు ఏది కావాలో చాలా ఏరి కోరి ఎంచుకొని ఎలాంటి సంకోచం లేకుండా తింటారు.
చర్మం డబుల్ క్లీన్
చర్మ ఆరోగ్యంపై కొరియన్లకు ఎక్కువ శ్రద్ధ వుంటుంది. నూనెతో ఓసారి తరువా నీళ్లతో ఓసారి చర్మాన్ని కొరియన్లు శుభ్రం చేసుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications