Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Summer Must Foods : వేసవిలో వీటిని తినడం మిస్ అయ్యారో అంతే..!
ఎండను తట్టుకోవాలంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇది సహజంగా మన శరీరంలో రాదు. దానికి తగిన ఆహారం, పళ్లు, నీళ్లు తీసుకున్నప్పుడే మనం ఆ స్థితిలో ఉంటాం. ఎండకు బయట చాలా వస్తువులు, పళ్లు, కూరగాయలు కాలిపోతూ ఉంటాయ్. మన శరీరంలోని అవయవాలకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ఎండ ధాటిని శరీరం తట్టుకోవాలంటే కొన్ని పళ్ళు, ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూదీన
పూదీనకు శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉంటుంది. బయట పూదీనా జ్యూసులను అమ్మడం చూసి ఉంటాం. పూదీన లేనిదే కూరలను కూడా చాలా మంది వండుకోరు. ఈ వేసవిలో మనం తినే ఆహారంలో పూదీన ఖచ్ఛితంగా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ కూరల్లో పూదీన వేసుకోవడం, మూడు రోజులకోసారి పూదీన రసాన్ని తాగడం చేస్తే శరీరం హైడ్రేటెడ్‌గా కూల్‌గా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు
తాగిన వెంటనే శరీరాన్ని నిమిషాల్లో యాక్టివ్ చేసే శక్తి కొబ్బరి నీళ్లల్లో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్‌ట్రోలైట్లు సంమృద్ధిగా ఉంటాయ్. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కొబ్బరి నీళ్లల్లో మెండుగా ఉంటాయ్.
పుచ్చకాయ
పుచ్చకాయలో వైటమిన్ సీ తో పాటు పొటాషియం, వైటమిన్ ఏ ఉంటాయ్. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయ్. ఎలక్టోరైట్లు కూడా ఎక్కువగా ఉండడం తో శరీరం యాక్టివ్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ప్రతీ రోజు పడుకునే ముందు భోజనం తరువాత కొన్ని పుచ్చకాయ పళ్లను తింటే ఇక మీ శరీరాన్ని ఎంత ఎండైనా వడదెబ్బ తగలనీయకుండా చేయగలదు. దీంతో పాటు గుండె సంబధిత వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
ఖీరదోసకాయ
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉండే వాటిలో ఖీరదోసది కూడా ప్రత్యేక స్థానం. దీనిని మనం సలాడ్‌గా ప్రతీ రోజు భోజనంలో ఉపయోగించుకోవాలి. లేదు నేరుగానైనా తీసుకోవాలి. భోజనం చేసే సమయంలో ఒక 6 నుంచి 7 ఖీరదోస ముక్కలను తిన్నా శరీరం పూర్తిగా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రక్తపోటును నియంత్రించే శక్తి దీనిలో ఉంది. కళ్లకి చర్మానికి కూడా ఈ ఖీద దోస చాలా ఆరోగ్యకరం. క్యాన్సర్ ముప్పు నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. శరీరంలో ఉండే హానికర బ్యాక్టీరియాను కూడా బయటకు పంపిస్తుంది.
యోగర్ట్
ఈ మండే ఎండలో పెరుగుకన్నా యోగర్ట్ శరీరానికి చాలా చలువ చేస్తుంది. పెరుగుతో పోలిస్తే యోగర్ట్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయ్. యోగర్ట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు కావలసినన్ని పోషకాలను అందిస్తుంది. రోజూ తినే ఆహారంలో పెరుగుకు బదులుగా యోగర్ట్‌ను ఉపయోగించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications