Latest Updates
-
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా!
Best summer detox drinks: సమ్మర్ లో తప్పక తాగాల్సిన 5 కూల్ డ్రింక్స్ ఇవే..ఆరోగ్యంతో పాటు అందం కూడా
సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలంలో మన చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారుతుంది. ఎందుకంటే అధిక వేడి, చెమట,ధూళి చర్మాన్ని డ్రీహైడ్రేషన్ చేస్తుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు,ఇతర ద్రవాలు తగినంతగా లేకపోవడం. సమ్మర్ లో చర్మాన్ని కూల్ గా ఉంచడానికి సరైన హైడ్రేషన్ ముఖ్యం. ఎండాకాలంలో చర్మాన్ని డీటాక్స్..అంటే శరీరం నుంచి విష పదార్థాలను,టాక్సిన్స్ లేదా హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడయే 5 బెస్ట్ కూల్ డ్రింక్ ఉన్నాయి. ఈ డ్రింక్స్ మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచడమే కాకుండా చర్మాన్నీ లోపల నుంచి మెరుగుపర్చడంలో సాయపడతాయి.
కోకోనట్ వాటర్
సమ్మర్ వచ్చిందంటే చాలు రోడ్లమీద ఎక్కడచూసిన కొబ్బరి బోండాలు కనబడుతుంది. కొబ్బరినీళ్లను మిగతా సీజన్ లతో పోల్చితే సమ్మర్ లోనే ఎక్కువగా తాగుతుంటారు. వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత ఇష్టమైన,హైడ్రేటింగ్ డ్రింక్స్ లో ఒకటి. ఇందులో సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్లు,మినరల్స్ ఉంటాయి..ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కొబ్బరినీళ్లు చర్మ తేమను కాపాడుతుంది..మొటిమలు,మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చియా సీడ్ డిటాక్స్ వాటర్
చియా విత్తనాల నీరు చర్మానికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా మేలు చేసే గొప్ప డీటాక్స్ డ్రింక్. చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి.. దానిని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఈ డ్రింక్ తయారు చేయడానికి..చియా విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ శరీరాన్ని చల్లబరుస్తుంది,చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
వెలగపండు జ్యూస్
అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సంప్రదాయ సమ్మర్ సూపర్ ఫుడ్ వెలగపండు. దీంతో చేసిన డ్రింక్ తీసుకోవడం వేసవిలో చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ డ్రింక్ జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది, ఇది మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
గోండ్ కటిర కూలింగ్ డ్రింక్
గోండ్ కటిరా అనేది శరీరాన్ని చల్లబరచడానికి, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగించే సహజ గమ్. ఈ పానీయం ముఖ్యంగా వేసవిలో సన్ స్ట్రోక్, చెమట వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని నీటితో కలిపి.. తేనె, నిమ్మకాయ వాటర్ తో కూడా కలిపి కలపవచ్చు. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, విషాన్ని తొలగిస్తుంది, యాంటీ ఏజింగ్ గా, ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. దీంతో పాటు ఇది కడుపు సమస్యలను కూడా నయం చేస్తుంది, ఇది చర్మంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపదు.
పసుపు, తేనె పానీయం
పసుపు, తేనె కలయిక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని శుద్ధి చేయడానికి, ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది మంటను తగ్గించడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అంటే శరీరం నుండి విషపదార్థాలను తొలగించే ప్రక్రియకు సహాయపడుతుంది. తేనె ఒక సహజ యాంటీ బాక్టీరియల్..ఇది చర్మపు మంట,మొటిమలను తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు,తేనె కలిపి తాగాలి. ఈ పానీయం చర్మానికి సహజమైన డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది,శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications