Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Best weight loss drinks : ఇవి తాగితే కొవ్వు కరిగిపోవడం ఖాయం.. ఒక వారం ట్రై చేయండి మీకే తెలుస్తుంది..
అధిక బరువు ఉండడం వల్ల శరీరం భాగంగా మాత్రమే కాదు చాలా అనారోగ్యాలకు కారణమవుతుంది. బరువు తగ్గితే సగం రోగాలు తగ్గుతాయని స్వయంగా వైద్యులే సలహా ఇస్తున్నారు. సంతానలేమి సమస్యకైనా, లివర్ సమస్యకైనా, యముకల సమస్యకైనా, గుండెసమస్యలకైనా ముందుగా బరువు తగ్గమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నిలువ ఉండడం వల్ల హానికర బ్యాక్టీరియాలు పెరిగే అవకాశముంది.
ఈ బరువుల సమస్యను కేవలం పానియాలు తాగి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొన్ని వారాల పాటు ఇక్కడ మేము సూచించిన పానియాన్ని తాగి చూడండి. ప్రతీ వారానికి బరువును చెక్ చేసుకుంటూ ఉండండి. కుదిరితే ప్రతీ రోోజు ఎంత బరువున్నారో లెక్క రాసుకోండి.
బరువు తగ్గడానికి సూపర్ వెయిట్ లాస్ డ్రింక్స్
కూరగాయల జ్యూస్
కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్‌ను తీసుకోవడం వల్ల ఆకలి తక్కువగా వేస్తుంది. దీంతో పరోక్షంగా అనవసర ఆహారం శరీరంలోకి వెళ్లకుండా డైట్ మెయింటేన్ అవుతుంది. కాబట్టి ప్రతీ రోజు ఓ గ్లాస్ కూరగాయల జ్యూస్‌ను తాగండి.

జీలకర్ర రసం
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయ్. తైమోక్వినైన్ అనే పోషకం కూడా ఉండడం, లో కొలస్ట్రాల్ లెవెల్స్ వల్ల ఇది శరీరంలో వేడిని పెంచి బరువును తగ్గిస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో కెటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వల్ల కొవ్వు సులభంగా కరుగుతుంది. రోజుకో కప్ గ్రీన్ టీ మీ బరువును తగ్గడంలో దోహదపడుతుంది.
బ్లాక్ టీ (డికాక్షన్)
బ్లాక్ టీ లేదా డికాషన్‌లో క్యాలరీలను బర్న చేసే కెఫిన్ ఉంటుంది. శరీరంలో కొవ్వును కరిగించి పాలిఫెనాల్స్ బ్లాక్ టీలో ఉండడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
యాపిల్ సైడర్ వెనిగర్
బరువు తగ్గడంలోప అసిటిక్ యాసిడ్ తరువాతే ఏ పోషకమైనా.యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఈ అసిటిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడంతో బరువు సులభంగా తగ్గుతారు. ఇన్సులిన్ స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది.
ప్రొటీన్ డ్రింక్స్
ఉదయాన్నే ప్రొటీన్ డ్రింక్స్ తాగడం వల్ల కడుపు నిండుగా అనిపించి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీంతో కడుపులో అనవసరం చెత్త వెళ్లకుండా బరువు నియంత్రణను పరోక్షంగా చేపడుతుంది.
నీళ్లు
నీళ్లు తాగడం వల్ల ఏ శ్రమ లేకుండా శరీరంలో 20 నుంచి 30 శాతం క్యాలరీలు బర్న్ అవుతాయని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి నీళ్లు తరచుగా తాగే వారి బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications