Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వీటి వల్ల క్యాన్సర్ వచ్చేే రిస్క్ చాలా ఎక్కువ..! వీటికి దూరంగా ఉండండి..!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయ్. దేశంలో క్యాన్సర్ కు గురౌతున్న వారు కూడా పెరిగిపోతూ ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం భారత దేశంలో 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడినట్టు తేలింది. ఈ సంఖ్య సామాన్య ప్రజల్లో భయాన్ని పుట్టిస్తోంది. ఈ లెక్కల ప్రకారం దేశంలో ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు అనుకోవచ్చ. అయితే ఈ క్యాన్సర్‌కు గల ముఖ్య కారణాన్ని తెలుసుకోగలిగితే దాని ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
కేవలం పొగతాగడం, గట్కా తినడం, మద్యం తాగడం వల్లే క్యాన్సర్ బారిన పడము, హానికర రసాయనాల వల్ల కూడా క్యాన్సర్‌కు గురౌతాము. క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన కారకాల గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
పారాబెన్
కాస్మటిక్ వస్తువులైన షాంపూ, మేకప్ క్రీమ్, సబ్బులు లాంటి పదార్ధాలు ఎక్కువ రోజులు నిలువ వుండాలంటే వాటిలో పారాబెన్ కెమికల్స్‌ను కలుపుతారు. ఈ పారాబెన్ రసాయనం వల్ల ఈ పదార్ధాలు ఎక్కువ నిలువ వుంటాయ్. ఇవే తరువాత క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతాయని పరిశోధకులు కనుగ్నొన్నారు. పిల్లలు పుట్టడానికి కూడా అడ్డుగా మారుతుందని, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. పారబీన్ పదార్ధం లేని వస్తువులను కాస్మటిక్స్‌ను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
ఫార్మల్‌డీహైడ్
కారు పార్ట్స్ తయారు చేయడంలో, బట్టలు తయారు చేయడంలో, పురుగుల మందు తయారీలో ఫార్మల్ డీహైడ్ అనే గ్యాస్‌ను వాడుతారు. ఇది కూడా క్యాన్సర్‌కు ఫ్రదాన కారణం అయ్యే అవకాశం ఉన్నట్లు కనుగ్గొన్నారు. ఫార్మల్‌డీహైడ్ లేని వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతన్నారు.

అక్రిలమైడ్
ఎక్కువ మంటపై వంటలు వండినప్పుడు, లేదా ఖడాయ్‌లో వేపుళ్లు చేసినప్పుడు అక్రిలమైడ్ అనే కెమికల్ పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కూడా క్యాన్సర్ రావచ్చని పరిశోధనల్లో బయటపడింది. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసిన వాటిని తినకుండా ఉండడమే ఆరోగ్యకరమని గుర్తించాలి. ప్రతీ వస్తువు, లేదా వంటకం చేసుకునేప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కోల్ టార్
బొగ్గును తయారు చేసే క్రమంలో మనకు చార్కోల్ నూనె ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్‌గా భావించవచ్చు. కాస్మటిక్, స్కిన్ కేర్ ప్రాడక్టుల్లో ఈ కోల్ టార్ పదార్ధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఊపిరి తిత్తులు, కిడ్నీ, బ్లాడర్, జీర్నక్రియ దెబ్బతిని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
తలాటెస్
పర్ఫ్యూముల్లో, నెయిల్ పాలిష్, స్ప్రేల్లో తలాటెస్ రసాయనాన్ని కలుపుతారు. ఇవి కలపడం వల్ల ఎక్కువ కాలం నిలువ వుంటాయ్. ఇది క్యాన్సర్‌కు ప్రధాన కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయ్. ఈ తలాటెస్ వల్ల ఎలర్జీలు, హార్మోన్ల సమతుల్యత కూడా వచ్చే అవకాశం ఉంది.
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇవి పాటించాలి :
పొగతాగడం, మద్యం తాగే అలవాటు ఉంటే వెంటనే మానివేయాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. మంచి డైట్ తీసుకోవాలి. వ్యాక్సిన్లను తీసుకోవాలి. పోషకాలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. రోజు వారి మన నిత్యజీవితంలో కెమికల్స్ వాడకాన్ని తగ్గించాలి. కాస్మొటిక్‌లను ఎక్కువగా ఉపయోగించవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications