Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
బ్లడ్ ప్రెజర్‌ను ఇలా సింపుల్‌గా అదుపులో పెట్టుకోండి..!
అధిక రక్తపోటు ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. ఆహారం, లైఫ్‌స్టైల్లో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. బ్లడ్ ప్రజెర్ వల్లే రక్తం గుండె నుంచి శరీరానికి మొత్తం అందుతుంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా వున్నప్పుడు రక్తం రక్తనాళాల్లోంచి వేగంగా వెళ్తుంది. రక్త నాళాలు కూడా దెబ్బ తింటాయ్.
అధిక రక్తపోటును చాలా మంది పెద్ద సమస్యగా తీసుకోరు. కానీ ఇది ప్రాణాలను తీసివేస్తుంది. అమెరికన్లలో వయసులో వున్నవారు సగం మందికి పైగా ఈ హై బ్లడ్ ప్రెజర్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరో ఆందోళనకర విషయమేమంటే అధిక రక్తపోటు వుంటే లక్షణాలు కూడా కనిపించవని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు వల్ల గుండె దెబ్బతినేంత వరకు ఏ లక్షణాలూ వుండవని, గుండె దెబ్బతిన్న తరువాత ఆ లక్షణాలు బయటపడతాయని అంటున్నారు.
ఇంట్లోనే వుండి ఈ బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తూనే వుండాలి. ఇది మీలో బలాన్ని పెంచడమే కాకుండా మూడ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దీని వల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా వుంటాయ్. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలనేది కూడా వైద్యులను ముందుగా సంప్రదించాలి. నెమ్మదిగా వ్యాయామాన్ని మొదలుపెట్టాలి, తరువాత క్రమంగా వ్యవయామాన్ని పెంచుతూ వుండాలి. లైట్‌గా వాకింగ్‌కు వెళ్లండి, జాగింగ్‌కు వెళ్లండి, స్విమ్మింగ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితాలు వస్తాయ్. యూట్యూబ్‌లో వెతికితే బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో పెట్టుకోవడానికి చాలా రకాల వీడియోలు వుంటాయ్.

ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అవ్వాలి. కూరగాయలు, పళ్లు, గోదుమ, బ్రౌన్ రైస్ లాంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా వున్న పాల పదార్ధాలను, మాంసం, చేపలను, డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవాలి.
ఉప్పును తక్కువగా తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తింటేనే బ్లడ్ ప్రెజర్ తగ్గి, అదుపులోకి వస్తుంది. రోజుకు సగం టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవద్దని పోషకనిపుణులు హెచ్చరిస్తున్నారు. బయట ఫ్రై చేసిన ఆహారాలు, ఇన్స్‌టాంట్ ఆహార పదార్ధాల్లో కూడా సోడియం ఎక్కువగా వుంటుంది.
అధిక బరువుకు, బ్లడ్ ప్రెజెర్‌కు చాలా దగ్గరి సంబంధం వుంది. అధిక బరువు వున్న వారిలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా వుంటుంది. అదే బరువు తగ్గినప్పుడు బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. వ్యాయామం చేస్తూ కడుపు చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి.
పొగ తాగే అలవాటు వుంటే మానుకోవాలి. రోజూ పొగతాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ అమాంతంగా పెరుగుతుంది. పొగఎక్కువగా తాగే వారిలో బ్లడ్ ప్రెజర్ రిస్క్ ఎక్కువగా వుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పొగతాగడం వల్ల రక్తపోటు సమస్య మాత్రమే కాకుండా గెండె సమస్యలు కూడా పెరుగుతాయ్.
మద్యం తాగే అలవాటును కూడా తగ్గించుకోవాలి. ఎక్కువగా మద్యం తాగితే బ్లడ్ ప్రెజర్ కూడా ఎక్కువవుతుంది.
మానసికంగా ఎక్కువ వత్తిడికి కూడా గురి కావద్దు. ఎక్కువ మానసిక ఒత్తిడికి గురైతే బ్లడ్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువవుతుంది. ఊపిరిని గట్టిగా తీసుకొని నెమ్మదిగా వదిలితే బ్లడ్ ప్రెజర్ అదుపులోకి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











