Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సెలవుల్లో పిల్లల ఆరోగ్యం కోసం ఇలా చేయండి..!
మన చిన్నప్పుడు దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. హాస్టళ్లు వదిలేసి పరుగున పల్లెకు పారిపోయేవాళ్ళం. ప్రకృతికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా ఉండేవాళ్ళం. కోతి కొమ్మచ్చి, గోళీలాటలు, గుజ్జనగూళ్లు, తొక్కుడుబిళ్ల, అష్టాచమ్మా, ఇలా ఆటలు ఆడుకునే వాళ్ళం. అయితే ప్రస్తుతం కార్పొరేట్ కాలం వచ్చేసింది. తల్లిదండ్రులు పట్నాల్లో స్థిరపడిపోవడంతో, పిల్లలు పల్లెలకు దూరమవుతున్నారు. సెలవుల్లో పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఇంస్టాగ్రామ్ అంటూ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఈ సెలవుల్లో మీ పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి, ఫోన్ కి దూరంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం..
పల్లెలకు పంపించండి:
చాలా మంది వివిధ కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండిపోవడం వల్ల.. సెలవులకు కూడా తమ తమ సొంతూళ్లకు వెళ్లలేకపోతున్నారు. దీంతో పిల్లకు కూడా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు దూరమవుతున్నాయి. అందుకోసం తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజీ అయిపోయినప్పటికీ.. పిల్లలకు సొంతూరికి పంపించాలి. తద్వారా కాలుష్యానికి కొంత దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే సెలవుల్లో పిల్లలను ఫోన్ కి దూరంగా ఉంచొచ్చు. దీంతోపాటు మన సంసృతి సంప్రదాయాలు, ఆచారాలు తెలుసుకుంటారు.

పాతకాలపు ఆటలు నేర్పించండి:
ప్రస్తుత కాలంలో పిల్లలకు మొబైల్ గేమ్స్ తప్ప.. అవుట్ డోర్ గేమ్స్ ఏమీ తెలియవు. తద్వారా వారు మొబైల్స్ కి బానిసవడంతో పాటు వివిధ రకాల రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. అందుకే ఈ సెలవుల్లో పిల్లలకు పాతకాలపు ఆటలను నేర్పించండి. కోతి కొమ్మచ్చి గోళీలాటలు, గుజ్జనగూళ్లు, తొక్కుడు బిళ్ల లాంటి ఆటలు ఆడిపించడం ద్వారా ఇతరులతో స్నేహం పెరగడంతో పాటు వ్యాయాయం కూడా అవుతుంది. తద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాంగా ఉంటారు.
ఆర్గానిక్ వంటలు వండి పెట్టండి:
ఇప్పుడైతే మనకు పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు వచ్చాయి కానీ. ఒకప్పుడు జొన్న రొట్టె, చద్దన్నం, జొన్న గట్కా, రాగిజావ ఇవే తినేవాళ్ళం. ఇప్పుడున్న వారిలో చాలా మందికి ఈ ఫుడ్ అలవాటు ఇప్పటికీ ఉండే ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉండే ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా పిల్లలకు కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో అందుతాయి.
చిన్ననాటి పుస్తకాలు చదివించండి:
ఇప్పుడైతే ఆడియో పోడ్ కాస్ట్ వచ్చేశాయి. కానీ ఒకప్పుడు పుస్తకాలే మనకు సినిమాలు, కథలు, నవలలు, అన్నీ. అవి మానసిక వికాసంతో పాటు, సమాజంలో మెలగాల్సిన పద్ధతులు, విలువలు నేర్పేవి. ఇప్పటి కాలం పిల్లల్లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని పూడ్చడానికి, మనం చిన్నతనంలో చదివిన పుస్తకాలను.. మీ పిల్లలతో చదివించండి. ఇవి మీ పిల్లల్లో ఆలోచన శక్తిని, సమాజంలో మెలగాల్సిన తీరును నేర్పిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications