Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Sleeping tips : నిద్ర తొందరగా పట్టడం లేదా..? ఈ చిట్కా ట్రై చేయండి.. హాయిగా నిద్రపోండి..!
నిద్ర పట్టకపోవడం కూడా ఇప్పు ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా మారింది. నిద్రలేమితో చాలా మంది సతమతమవుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడ్డానికి చాలా రకాల మందులను వాడుతున్నారు. కొందరు ప్రత్యేకంగా చికిత్స కూడా చేయించుకుంటున్నారు. కంటి నిండా నిద్రపోవడం కూడా ఇప్పుడు లక్జరీగా మారిన పరిస్థితి నెలకొని వుంది. ఈ నిద్రలేమి సమస్యను దృష్టిలో పెట్టుకొని పరిశోధకులు కొన్ని చిట్కాలను అందించారు. వీటిని పాటిస్తే ఖచ్ఛితంగా హాయిగా నిద్రపోవచ్చని చెబుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం 14.5 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యతో బాధపడే వారి శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిద్రపట్టకపోవడానికి కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాకుండా మధుమేహం లాంటి ఇతర అనారోగ్య సమస్య కూడా కారణం కావచ్చన్నారు. కొన్ని మానసిక వ్యాయామాల ద్వారా ఈ నిద్రలేమి సమస్యతో కొంత వరకు బయటపడవచ్చని అంటున్నారు.
మెదుడులోకి ఏవస్తువు వస్తే ఆ వస్తువుల పేర్లను తలుచుకుంటూ వుంటే కూడా నిద్ర పడుతుందని వైద్యాలు చెబుతున్నారు. ఇలాంటి మరెన్నో చిట్కాలను అందిస్తున్నారు.
పడుకునే ముందు
నిద్ర సులభంగా పట్టాలంటే పడుకునే ముందు పుస్తకం చదవడం, స్నానం చేసుకోవడం, లేదా ధ్యానం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల కూడా నిద్ర వేగంగా వచ్చే అవకాశముందంటున్నారు. స్కూల్లో, కాలేజీ సమయాల్లో మనకు పుస్తకం తెరవగానే నిద్ర కమ్ముకొని వచ్చేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వుండవచ్చు ఒక సారి ట్రై చెయ్యండి.

నిద్రించే ప్రదేశం
హాయిగా నిద్రపోవాలంటే నిద్రించే ప్రదేశం ఎలా వుందనేది కూడా చాలా ముఖ్యం. బెడ్‌రూం ప్రశాంతంగా వుండేలా చూసుకోవాలి. ఎక్కువ శబ్దాలు లేకుండా జాగ్రత్తపడాలి. కళ్లకు లైట్ ఎక్కువ పడకుండా బెడ్ ల్యాంప్‌ను తక్కువ లైట్‌తో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
కంప్యూటర్, ఫోన్ వాడకాన్ని తగ్గించాలి
నిద్రించే సమయంలో కంప్యూటర్, ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించవద్దు. వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కళ్లు దారుణంగా దెబ్బతినే అకాశం వుంది. పడుకునే కొన్ని నిమిశాల ముందు ఫోన్, లేదా కంప్యూటర్‌ను వాడవద్దు. కొందరు చీకట్లో ఫోన్‌లను, కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ వుంటారు. ఇది కూడా కంటికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తినే ఆహారం
మనము తినే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. కడుపు నిండిన దానికంటే కూడా కొందరు మరికొంత ఎక్కువగా తింటారు. ఇలా తినడం వల్ల కూడా కడుపులో ఉబ్బరంగా, ఆయాసంగా అనిపించడం వల్ల నిద్ర పట్టదు. నిద్రించే ముందు కెఫిన్, మద్యం తీసుకోవడం వల్ల కూడా నిద్రకు భంగం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామాలు
నిద్రపోయే ముందు బ్రీతింగ్ వ్యాయామాలు లాంటివి చేయడం వల్ల కూడా నిద్ర త్వరగా పట్టే అవకాశం వుంది. ప్రతి రోజు ఉదయం ఒక గంట వ్యాయామం చేయడం వల్ల శరీరం బాగా అలసిపోతుంది. ఆ రోజు పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి భోజనం చేయగానే శరీరం బాగా అలసిపోవడం వల్ల త్వరగా నిద్రపడుతుంది.
తియ్యని పదార్ధం
ఒక గ్లాసు పాలల్లో తగినంత చెక్కరను వేసుకొని తాగడం వల్ల కూడా నిద్రపడుతుంది. తియట్టి పదార్ధాల్లో నిద్రను ప్రేరేపించే ఇంగ్రీడియంట్స్ వుండడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది. ప్రతి రోజు చెక్కరను తీసుకోవడం కూడా శరీరానికి ఆరోగ్యకరం కాదనే విషయాన్ని మరిచిపోవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications