Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
ఈ అలవాట్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా చేస్తుంది..! 100% గ్యారెంటీ..!
చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడంటే రకరకాల క్రీములను ఉపయోగిస్తాం. ప్రతి వారం ఒక చిట్కాను ఫాలో అయి దాన్ని అప్లై చేస్తాం. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బ తినే అవకాశాలున్నాయ్. చాలా పరిశోధనల తరువాత చర్మం ఆరోగ్యంగా వుండడానకి కొన్ని ప్రత్యేకమైన టిప్స్‌ను అందిస్తున్నాం. వీటని కొన్ని రోజులపాటు పాటించి ఫలితం చూడాలి.
కింటి నిండా నిద్రపోవడమే కాదు త్వరగా నిద్దరపోయ్, త్వరగా మేలుకోవాలి. అప్పుడు చర్మం ఆరోగ్యంగ వుంటుంది. బాడీ మొత్తం రీచార్జ్ కావాలంటే నిద్ర తప్పనిసరిగా వుండాలి.
పరిగడపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే టాక్సిక్ పదార్ధాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయ్. ఇది కడుపులోని జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ప్రతి రోజూ 8 నుంచి 10 కప్పుల నీరును ఖచ్చితంగా తాగాలి. రక్తం శుద్ధి కావాలంటే శరీరంలో తగినంత నీరు వుంటేనే సాధ్యమైతుంది. ఇది చర్మంపై ప్రభావం చూపుతుంది.
పడుకునే ముందు స్నానం చేయడం వల్ల చర్మపై ఉన్న క్రిములు, బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. మేకప్ తొలగించకుండా అలాగే పడుకుంటే చర్మంపై రసాయనాల ప్రభావం ఎక్కువగా పడి పాడైపోతుంది.
స్నానం చేయగానే మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి. చర్మం డీహైడ్రేట్ అవుతే బయట వున్న దుమ్ము ధూళి చర్మంపై పడి మరింత దెబ్బతినే అవకాశం వుంది కాబట్టి మాయిశ్చరైజర్‌ను తప్పుకుండా అప్లై చేసుకోవాలి.
మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే చర్మం కూడా ఆరోగ్యంగా వుంటుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడికి గురౌతే కొన్ని రకాల హార్మోన్ల విడుదల వల్ల వయసు చర్మంలో మార్పులు వచ్చే అవకాశం వుంది. ఒత్తిడికి గురైతే రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుందని పరిశోధనలు చెబుతున్నాయ్.
చర్మం దెబ్బతిన్నట్లు అనిపిస్తే వెంటనే ఏ సంకోఛం లేకుండా వైద్యులను సంప్రదించాలి. చర్మంపై కురుపులు వచ్చి తగ్గకపోయినా లేకా పెలిపిరి లాంటివి వచ్చి రంగు మారుతున్నా వెంటనే వైద్యులను లేదా స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి.
హానికరమైన స్కిన్ క్రీమ్‌లను ఎక్కువగా ఉపయోగించవద్దు. న్యాచురల్ పద్దతిలోనే చర్మానికి సంబంధించినవి ఉపయోగించాలి. తాజా పరిశోధనల్లో కాస్మొటిక్స్‌లో వుండే కెమికల్స్ వల్ల క్యాన్సర్ కారకమైన కార్సినోజెన్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగ్గొన్నారు.
చర్మానికి ఎండను ఎక్కువగా తగలనీయకుండా వుండాలి. సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేసుకోవాలి. ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పివేసుకోవడం, ఎండ పడకుండా ప్రత్యేకమైన ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి.
చల్ల నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. వేడి నీరు చర్మానికి మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. చలికాలంలో వేడినీటి కన్నా గోరువెచ్చని నీటిని స్నానానికి ఉపయోగించాలి.
పొగ తాగడం కూడా చర్మంపై దుష్ఫలితాలను ఇస్తుంది. పొగతాగితే చర్మంలో వయసు పెరిగిన లక్షణం కనబడుతుంది. చర్మం ముడతలు పడతాయ్. చర్మానికి ఆక్సీజన్ వెళ్లకుండా చేస్తుంది. పొగ తాగడం వల్ల చర్మంలో వుండే కొల్లేజెన్, ఎలాస్టిన్ దెబ్బతింటాయ్. ఇవి చర్మాన్ని బలంగా వుంచడంలో దోహదపడుతుంది. పోగతాగే సమయంలో ఆ పొగ ముఖంపై చర్మానికి తాకడం వల్ల చర్మం దెబ్బతింటుంది. దీంతో ముడతలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా వుంటాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications