Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కళ్లు నక్షత్రాల్లా మెరిసిపోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఇవి మంచిగా తినాల్సిందే!
మనిషి శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమైనవి. అవి లేకపోతే మనం ఎవీ చూడలేము. ప్రపంచం అంతా నల్లగానే కనిపిస్తుంది. ఆ అద్భుతమైన రంగుల లోకాన్ని చూడాలంటే కచ్చితంగా నేత్రాలు కావాల్సిందే. కళ్లు లేని వాళ్లు పడే బాధ చూస్తుంటేనే అది అర్థం అవుతుంది.
ఏ పనీ చేసుకోలేక వారు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. మరొకరి సాయం లేకుండా వారి పనులు కూడా వారు చేసుకోలేరు. అలాంటి సమస్యలు మీరు కూడా పడొద్దు అనుకుంటే కళ్లను కాపాడుకోవాల్సిందే. కళ్ల ఆరోగ్యం ఎంత బాగుంటే మీ జీవితం అంత బాగుంటుంది.

అయితే అవి కళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, నక్షత్రాల్లా మెరిసపోవాలన్నా కొన్ని ఆహారాలు తప్పనిసరి. కళ్ల ఆరోగ్యం బాగుంటనే మనిషి కూడా చాలా అందంగా కనిపిస్తాడు. కళ్లపైనే చాలా మంది అందం కూడా ఆధారపడి ఉంటుంది. మరి చేప కళ్ల లాంటి అందమైన కళ్లు కావాలన్నా, అవి బాగా కనిపించాలన్నా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆకుకూరలు:
ఆకుకూరలు దృష్టిని మెరుగు పరచడానికి చాలా బాగు ఉపయోగపడతాయి. అందులో ఉండే విటామిన్లు, యాంటీ ఆస్కిడెంట్ల వల్ల కళ్లు చక్కగా కనిపిస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే లుటిన్ కూడా నేత్రాల ఆరోగ్యానికి మంచిది.
2. క్యారెట్:
క్యారెట్ లో విటామిన్ ఏ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. విటామిన్ ఏ కంటి చూపునకు తోడ్పడుతుంది. దీని వల్ల రెటీనాలో ఉండే వర్ణ ద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయ పడుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా రక్షిస్తుంది.
3. చిలకడదుంప:
చిలకడదుంపలో ఉండే విటామిన్ ఏ, విటామిన్ సీ, లుటిన్ లు అధికంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది.
4. బాదాం:
బాదాం పప్పులో విటామిన్ ఇ ఉంటుంది. బాతం తరచుగా తీసుకుంటే వయసు మీద పడడం వల్ల వచ్చే మచ్చల క్షీణత, కంటి శుక్లం సమస్యను నివారిస్తుంది.
5. గుడ్లు:
గుడ్లలో లుటిన్, జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది వయసు సంబంధిత దృష్టి లోపం ప్రభావాన్ని తగ్గిస్తుంది. వీటిలో విటామిన్ సి, ఇ, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.
6. సిట్రస్ పండ్లు:
సిట్రస్ పండ్లలో విటామిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటామిన్ ఇ లాగా విటామిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇధి వయసు సంబంధిత దృష్టి సమస్యలతో పోరాడుతుంది.
7. చేపలు:
చేపల వల్ల కూడా కంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీటిలో ఉంటే ఒమేగా-3 కోవ్వు ఫ్యాటీ ఆమ్లాలు, యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కళ్లు మసకగా కనిపించే సమస్య ఉన్న వారికి ఆ సమస్యను దూరం చేస్తుంది.
సో ఇంకెందుకు ఆలస్యం... పైన చెప్పిన ఆహార పదార్థాలన్నింటినీ వారంలో ఒక్కసారైనా తినండి. అంటే ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం తీసుకుంటే కేవలం కళ్ల ఆరోగ్యమే కాదండోయ్.. మీ శరీర ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications