Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇవి తింటే కిడ్నీలు కొట్టేస్తాయి..రోజూ మీరు తినేది ఇవేనా? చెక్ చేసుకోండి
సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంలో రెండు కిడ్నీలు ఉంటాయి. వీటినే తెలుగులో మూత్రపిండాలు అంటారు. ఇవి బీన్స్ ఆకారంలో చిన్నగా ఉండి మన శరీరంలో అవిశ్రాంతంగా పనిచేస్తుంటాయి. మనం తినే ఫుడ్, పీల్చే గాలి ద్వారా శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు, విషతుల్యమైన మలినాలను రక్తం నుంచి వేరు చేసి మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. మనశరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహించే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. సాధారణంగా తరచుగా మనం తినే కొన్ని ఆహారాల వల్ల కిడ్నీలు నిదానంగా పాడైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీసే ఆహారాలివే
రెడ్ మీట్
నాన్ వెజ్ తినే చాలామందికి మటన్ అంటే లొట్టలేసుకుంటూ తినేంత ఇష్టం. అయితే మటన్ వంటి రెడ్ మీట్(ఎర్ర మాంసం)ఎక్కువగా తీసుకున్నప్పుడు మన శరీరంలో యూరియా, క్రియేటినిన్ వంటి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యర్థ్యాలను తొలగించడానికి కిడ్నీలు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఉప్పు
మన భారతీయ వంటకాల్లో ఉప్పు లేనిదే రుచి ఉండదు. మనం పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుబోయే దాకా తీసుకునే ఆహారాల్లో ఉప్పు ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవానికి రోజుకి 5 గ్రాముల ఉప్పు తీసుకుంటే చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చెబుతుంది.. అయితే అంతకంటే ఎక్కువ ఉప్పునే సాధారణంగా మనం రోజులో తీసుకుంటాం. అయితే మనం అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల ఇది నేరుగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఒకసారి మీ రక్తపోటు పెరిగితే అది మీ మూత్రపిండాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సంవత్సరాల తరబడి ఇలా జరిగితే మీ మూత్రపిండాలు క్రమంగా బలహీనపడతాయి. సాధారణ ఉప్పు కంటే ఇది కొంచెం తక్కువ సోడియంను కలిగి ఉంటుంది..దీనిని మితంగా ఉపయోగించవచ్చు.
ప్రాసెస్డ్ లేదా ప్యాక్ చేసిన ఆహారాలు
ప్రస్తుతం అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఫుడ్ వండుకొని తినే టైం కూడా లేకుండాపోతుంది. దీంతో చాలామంది ఇన్ స్టంట్ నూడిల్స్, చిప్స్, ఫ్రోజెన్ స్నాక్స్, రెడీ టూ ఈట్ కూరలు వంటి వాటిపై ఆధారపడుతున్నారు. క్షణాల్లో తయారయ్యే ఆహారాలు వాస్తవానికి చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలు సోడియం, ప్రిజర్వేటివ్స్(నిల్ల చేయడానికి ఉపయోగించే రసాయనాలు),అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటే మాత్రం మూతప్రిండాలకే కాకుండా గుండెకు కూడా డేంజరేనట.
సాఫ్ట్ డ్రింక్స్
సాఫ్ట్ డ్రింక్ తాగేటోళ్లు ఎక్కువే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు రోజూ అదే పనిగా చల్లటి సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయితే క్షణాల్లో దాహాన్ని ఇవి ఎంత రుచిగా ఉంటాయో మీ కిడ్నీలకు ఇవి అంత డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫాస్పేట్లు కూడా అధికరంగా ఉంటాయి. ఈ రెండూ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వీటికి బదులుగా కొబ్బరినీళ్లు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యేస్ తాగడం మంచిదని సూచిస్తున్నారు.
డీప్ ఫ్రై ఫుడ్స్
పదే పదే వేడి చేసిన నూనెలు ఉపయోగించి తయారుచేసే ఫుడ్స్ కి దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా వీధుల్లో అమ్మే డీప్ ఫ్రైడ్ ఫుడ్, ప్లాస్టిక్ ప్యాకెట్లలో లభించే స్నాక్స్ విషయంలో మరింత అలర్ట్ గా ఉంటారు. వీటిలో ఉపయోగించే నూనెలు నాణ్యమైనవి కాకపోతే ఆరోగ్యానికి డేంజర్. కిడ్నీలు కూడా తొందర్లోనే షెడ్ కి వచ్చేయడం గ్యారెంటీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications