అమ్మాయిలూ అలర్ట్‌.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!

పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక మార్పులు, సమస్యలు అన్నీఇన్నీ కావు. కొందరు మహిళలు కడుపు నొప్పి, అలసట, ఉబ్బరంతో పాటు మానసికంగా, భావోద్వేగపరంగా చాలా రకాల మార్పులను అనుభవిస్తారు. అయితే వీటిన్నిటికీ ప్రధాన కారణం కొన్ని ఆహారపు అలవాట్లేనని గైనకాలజిస్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఆహారపు అలవాట్లేంటి.. రుతుస్రావం సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. డాక్టర్ల సలహాలు చూద్దాం..

These food mistakes made during menstruation cause stomach pain and fatigue

మహిళల్లో రుతుస్రావం, రుతుచక్రం సక్రమంగా ఉంటేనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండగలరు. వారి జీవితంలో పీరియడ్స్‌ మొదలు నుంచి మెనోపాజ్‌ దశ వరకు ఆరోగ్యపరంగా గర్భాశయ పరిస్థితులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల సమతుల్యంగా ఉండాలి. అయితే ఈ హార్మోన్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఏం తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఆ సమయంలో మహిళలు ఫేస్‌ చేసే పరిస్థితులకు ఈ ఆహారపు అలవాట్లే కారణం.. అవేంటంటే..

మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!

తీవ్రమైన కడుపు నొప్పికి కారణం

నెలసరి సమయంలో మహిళలు ఎక్కువగా అలసట ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే ఈ సమయంలో కెఫీన్‌ అధికంగా తీసుకోవడం వల్ల గర్భాశయంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. దీంతో కడుపు నొప్పికి దారితీస్తుంది. ఇంకా టీ, కాఫీలోని టానిన్లు బాడీ ఐరన్‌ను శోషించకుండా నిరోధిస్తుంది.

These food mistakes made during menstruation cause stomach pain and fatigue

మానసిక స్థితిలో మార్పులకు కారణం

పీరియడ్స్‌ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా మెదడులో ఆనందాన్నిచ్చే కెమికల్స్‌ లెవెల్స్‌ తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా ఆకలి కాకపోవడం, ఇంకా భోజనం చేయాలని అనిపించకపోవడంతో శరీరానికి కావాల్సిన కార్బొహైడ్రేట్లు తగ్గుతాయి. అంతేకాకుండా కార్బొహైడ్రేట్లు తీసుకోవడం పూర్తిగా మానేసినట్లయితే అది తీవ్రమైన మానసిక ఆందోళన, శక్తిహీనతకి దారితీస్తుంది.

తీపి పదార్థాలు తినాలనే కోరిక

బుుతుస్రావం సమయంలో మహిళలకు ఎక్కువగా స్వీట్లు, చక్కెర పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. ఇందుకు మెగ్నీషియం లోపమే కారణం. దీంతో క్రేవింగ్స్‌ను నియంత్రించుకోలేక వీటిని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు సడెన్‌గా పెరుగుతాయి. ఫలితంగా మొటిమలు మరింతగా పెరిగి చర్మ కాంతిని పోగొడుతుంది.

These food mistakes made during menstruation cause stomach pain and fatigue

జీర్ణ సమస్యలకి కారణం

నెలసరి రోజుల్లో మహిళలు తేలికైన, తాజా ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బాగా ఉడికిన పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. కానీ చల్లని లేదా సరిగ్గా ఉడకని ఆహారం తీసుకున్నట్లయితే అది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. శక్తి కూడా ఎక్కువ కావాలి. దీంతో కడుపు నొప్పి సమస్యకి దారితీస్తుంది.

వర్షాకాలంలో ఫేషియల్‌ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! వర్షాకాలంలో ఫేషియల్‌ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!

తీవ్రంగా అలసట, నిర్లక్ష్యం వద్దు

ఈ సమయంలో మహిళలు ఎక్కువగా అలసిపోవడం, నీరసం అనుభవిస్తున్నట్లయితే దానిని సాధారణంగా కొట్టిపారేయకండి. రక్తస్రావంతో శరీరంలో ఐరన్‌ లోపానికి దారితీయవచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పై ఆహార పదార్థాలకి దూరంగా ఉంటూ తాజాగా, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, September 6, 2026, 19:00 [IST]
Desktop Bottom Promotion