Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు.. ఫ్రిజ్ రూల్స్ పాటించాల్సిందే..!
రిఫ్రిజిరేటర్ ఉంటే కూరగాయలు, పళ్లు పాడైపోతాయనే బాధ వుండదు. కొన్ని రోజుల వరకు నిలువ చేసుకొచ్చనే ధైర్యం వుంటుంది. వండిన కూరలను కూడా ఫ్రిజ్‌లో పెడతాము. ఫ్రిజ్‌లో ఏది పెట్టినా నిలువ వుంటుందనే అభిప్రాయాని వచ్చేస్తాం. కానీ అన్ని కూరగాయలను, పళ్లను ఫ్రిజ్‌లో పెట్టవద్దరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టకుండా వుంచాల్సిన ఆహారాలు ఏవి, కూరగాయలు ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం.
టమాటలు
టమాటలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే వాటిలో ఉన్న రుచి తగ్గే అవకాశం వుంది. రూం టెంపరేచర్‌లోనే టమాటాలను పెట్టాలి.
ఆలుగడ్డలు
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి మరింత తియ్యగా అవుతాయ్. ఫ్రిజ్‌కి బదులుగా ఒక పేపర్‌బ్యాగ్‌లో గనక స్టోర్ చేస్తే ఆలుగడ్డలు పాడవకుండా వుంటాయ్.

ఖీరదోసకాయ
దోసకాయలను ఫ్రిజ్‌లో పెడితే అవి పూర్తిగా పండిపోయి నీరు ఎక్కువగా ఎక్కుతాయి. ఖీర దోసకాయలు మెత్తగా అయిపోయ్ తినకుండా మిగిలిపోతాయ్. ఫ్రిజ్‌లో కాకుండా మూత గట్టిగా బిగించి వున్న డబ్బాలో ఖీరదోసకాయలను పెట్టవచ్చు.
అవకోడో
అవకోడో పళ్లుకు త్వరగా పండిపోయే లక్షణం వుంటుంది. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పండిపోయి తినరాకుండా అవుతాయ్. కాబట్టి వీటిని అప్పటికప్పుడే తినడం మంచిది. వీటిని ఎక్కువ రోజులు నిలువ వుంచలేము.
యాపిల్స్
సాధారణ రూం టెంపరేచర్‌లోనే ఎలాంటి కూలింగ్ అవసరం లేకుండా యాపిల్స్ వారం పాటు పాడవకుండా వుండగలుగుతాయ్. కాబట్టి యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో వుంచాల్సిన అవసరం లేదు.
పుచ్చపండు
పుచ్చపండు అలాగే ఫ్రిజ్‌లో పెట్టకుండా వాటిని ముక్కులుగా కోసి తరువాత ఫ్రిజ్‌లో పెడితే తినడానికి ఫ్రెష్‌గా వుంటాయ్.
కాఫీ బిల్లలు
కొందరు కాఫీ బిల్లలను ఫ్రిజ్‌లో పెడతారు. ఇలా చేయడం వల్ల కాఫి టేస్ట్ మారుతుంది. రూం టెంపరేచర్‌లో లేదంటే కిచెన్‌లో గట్టిగా మూత పెట్టిన డబ్బాలో వుంచవచ్చు.
తేనె
తేనెను ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పాడవదు. ఫ్రిజ్‌లో పెడితే తేనె గడ్డలు కటుతుంది. రూం టెంపరేచర్‌లో ఎన్ని రోజులవరకైనా తేనెను పెట్టవచ్చు.
డ్రై ఫ్రూట్స్
కాజు, బాదాం లాంటి డ్రై ఫ్రూట్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం కంటే గట్టిగా మూతపెట్టిన డబ్బాలో పెట్టవచ్చు. ఇలా డబ్బాలో వుంచడం వల్ల పాడయ్యే అవకాశం లేదు.
పీనట్ బటర్
పీనట్ బటర్‌ను 3 నెలల వరకు బయట వుంచినా పాడుక కాకుండా వుంటుంది. కాబట్టి ఫ్రిజ్‌లో పీనట్ బటర్ పెట్టనవసరం లేదు.
ఉల్లిగడ్డలు
ఉల్లిగడ్డలు ఫ్రిజ్‌లో కాకుండా బయట పెట్టినా పాడుకాకుండా వుంటాయ్. ఫ్రిజ్‌లో పెడితే రుచి మారే అవకాశం వుంది.
చాక్లెట్లు
చాక్లెట్లను సహజంగా ఫ్రిజ్‌లో పెట్టడానికే ప్రాధాన్యతిస్తాము. అయితే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటే ఫ్తేవర్‌లో రుచి మారే అవకాశం వుంది. చలికాలంలో చాక్లెట్లు బయట పెట్టినా కరిగిపోకుండా వుంటాయ్. కాబట్టి చాక్లెట్లను బయటే చల్లని ప్రదేశంలో పెట్టవచ్చు.
బ్రెడ్
ఫ్రెష్ బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. బ్రెడ్ తిన్న తరువాత ఒక పేపర్‌లో చుట్టి పెట్టినా బ్రెడ్ ఫ్రెష్‌గానే వుంటుంది.
అరటిపళ్లు
అరటిపళ్లు ఫ్రెష్‌గా వుండాలంటే బయటే పెట్టమని సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టి ఎక్కువ రోజులు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని అంటున్నారు.
ఆహారా పదార్ధాలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెట్టి తినడం ఆరోగ్యానికి కూడా హానికరమని పరిశోధనలు చెబుతున్నాయ్. పళ్లు, కురగాయలను మూడు నుంచి నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఫ్రిజ్‌లో పెట్టకుండా జాగ్రత్త పడాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications