Latest Updates
-
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే!
సమ్మర్ వచ్చిందని కొబ్బరినీళ్లు తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోకుంటే మరణమే!
మిగతా సీజన్ లతో పోల్చితే సమ్మర్ లోనే ఎక్కువగా కొబ్బరినీళ్లు తాగుతుంటారు. వేసవికాలం మొదలైందంటే చాలు ఇక డైలీ ఒక లీటరు కొబ్బరినీళ్లు తాగేటోళ్లు బోలెడు మంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, పోషకాలను తిరిగి నింపడానికి నీటితో పాటు ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం చాలా ముఖ్యం. వాస్తవానికి కొబ్బరి నీరు ఆరోగ్యం, హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన సహజ పానీయం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి, అలసట,బద్ధకం పెరుగుతాయి. చాలా మంది హీట్ స్ట్రోక్ తో కూడా బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
రెండు రకాలు
కొబ్బరికాయలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి చిన్న కొబ్బరికాయలు,రెండోది పెద్ద కొబ్బరికాయలు. చిన్న కొబ్బరికాయల్లో ఎక్కువ నీరు ఉంటుంది, అయితే పెద్ద కొబ్బరికాయల్లో ఎక్కువ కొబ్బరి గుజ్జు ఉంటుంది. వీటిలో కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి. కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, సోడియం, ఫాస్ఫరస్, ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి- 2, విటమిన్ బి 3 కూడా ఉంటాయి.

కొందరికి మాత్రమే
వాస్తవానికి కొబ్బరి నీళ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన నేచురల్ డ్రింక్ అయినప్పటికీ ఇది అందరికీ సరైనది కాదని నిపుణులు తెలిపారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే సమస్యలు ఎదుర్కోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు, లో బీపీ, షుగర్, కొబ్బరి అలెర్జీలు ఉన్నవారు కోకోనట్ వాటర్ జోలికి పోకపోవడమే మంచిదంటున్నారు.
వీళ్లు కోకోనట్ వాటర్ తాగకపోవడమే మంచిది
-డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. కొబ్బరి నీళ్లలో సహజంగానే చక్కెర ఉంటుంది. అయితే, ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా మాత్రమే తాగాలి.
-లో బీపీ లేదా హైపోటెన్షన్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. లో బీపీ ఉన్నవారు లేదా హై బీపీ మెడిసిన్స్ వాడుతున్నవాళ్లు కొబ్బరినీళ్లు తాగితే తలనొప్పి, తిమ్మిరి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
-మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు శరీరంలో పొటాషియం నిల్వలను తగ్గించలేకపోతే అది హైపర్‌కలేమియా సమస్యకు దారితీస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications