Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఈ వ్యక్తులు రంజాన్‌లో హలీం అస్సలు తినకూడదు, ఎందుకో తెలుసా?
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఉపవాసాలు (రోజా) చేపట్టారు. రంజాన్ మాసం అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏదైనా ఉందంటే అది హలీం. మొదటగా ఇరాన్ దేశంలో ఈ హలీం తయారైంది. ఇక్కడి నుంచి ఇది భారతదేశం మొత్తం విస్తరించింది. మనం దేశంలోని చాలా ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా ఈ హలీం తింటుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మన దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడా హలీం చాలా పాపులర్. ఇప్పటి వరకు దీనిని ఎక్కువగా ముస్లింలు మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు హిందువులూ కూడా దీనికి ఆకర్షితులవుతున్నారు.
దీంతో మార్కెట్‌ల్లో హలీం దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి. హలీం టేస్ట్, రుచులకి ఎంతో మమ్మల్ని ఆకర్షిస్తుంది. కానీ దాని పోషక విలువలు కూడా ఎంతో ఎక్కువ. ఈ పోషక విలువలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే కొంతమంది వైద్యులు, ఈ హలీం ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. అది తినడం వలన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో పాటు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు హలీం తినకూడదు? తింటే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హలీంలోని పోషకాలు:
హలీం తయారీకి ప్రధానంగా గోధుమలు, చికెన్, మరియు వివిధ పప్పులను వాడుతూ ఉంటారు. గోధుమలు అధిక ఫైబర్ ఉన్నవి, ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ సమయం ఆకలిని నివారిస్తుంది. ఆకలి కాకుండా ఆపుతుంది. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో వారు దీనిని తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి ప్రోటీన్లతో కూడిన పప్పులు కూడా హలీంలో వాడతారు. ఇవి శరీరంలోని కండరాలని బలోపేతం చేస్తాయి మరియు మరింత బలం కలిగిస్తాయి.
అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలు కూడా హలీంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అలాగే హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉండకుండా చేసే పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా, ఇది ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా రక్షిస్తుంది.
ఎవరు హలీం తినకూడదు?
మధుమేహంతో బాధపడేవారు హలీం తినవచ్చు, కానీ ఇందులో ఉప్పు మరియు నూనె ఎక్కువగా ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. గుండె సమస్యలతో బాధపడే వ్యక్తులు ఇంట్లో తగిన మోతాదులో హలీం తయారు చేసుకుని తినడం మంచిది. అలాగే, చిన్న పిల్లలకు కూడా హలీం తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులో వాడే కొన్ని పదార్థాలు వారి జీర్ణ వ్యవస్థకు హానికరమైనవి కావచ్చు. గర్భిణీలు కూడా హలీం ఎక్కువగా తినకూడదు. అలాగే వృద్ధులకు కూడా తక్కువ మసాలాతో తయారుచేసిన హలీం తీసుకోవడం ఉత్తమం. ఇలాంటి వ్యక్తులు హలీం తినడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తినాలనుకునే వ్యక్తులు.. తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అది కూడా నిపుణుల సలహాలు తీసుకొని తినడం చాలా ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications