Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
వంట గదిలో దొరికే ఈ పదార్థాల వలన క్యాన్సర్ వస్తుంది.. మీరు వాడుతుంటే తస్మాత్ జాగ్రత్త
ప్రతి ఇంట్లో వంటగది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడే మనం వంటలు చేసుకుని ఆరోగ్యానికి అవసరమైన శక్తిని పొందుతాము. సాధారణంగా వంటగదిలో ఉపయోగించే పదార్థాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ వంటగది కారణంగా కొన్ని తీవ్రమైన వ్యాధుల వచ్చే అవకాశం ఉంటుంది. అందులో క్యాన్సర్, అలర్జీ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, వంటగదిలో ఉపయోగించే కొన్ని వస్తువులు మరియు ఆహార పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఎలాంటి వస్తువుల వల్ల క్యాన్సర్ వస్తుంది? వాటిని వాడితే ఏమవుతుంది? వాడడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీలో వివరించాము. పూర్తిగా చదివి తెలుసుకోండి. క్యాన్సర్ వంటి వ్యాధి వేగంగా పెరుగుతుండటంతో, ఆరోగ్య నిపుణులు వంటగదిలో ఉపయోగించే పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి వంట సామాగ్రి వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.

నాన్-స్టిక్ వంట సామాగ్రి:
వంటగదిలో ఉపయోగించే నాన్-స్టిక్ పాన్‌లు ఆరోగ్యానికి హానికరమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వంట సామాగ్రిని తయారుచేసే సమయంలో పెర్ఫ్లోరోక్టానాయిక్ ఆమ్లం (PFOA) అనే రసాయనం ఉపయోగిస్తారు. PFOA కలిగి ఉన్న నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువ సమయం ఉపయోగిస్తే, వాటి ద్వారా శరీరానికి హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలు మన ఆహారంలో చేరి, హార్మోన్ల లోపాలను, రోగనిరోధక శక్తి తగ్గడాన్ని, ఇంకా క్యాన్సర్ కు దారి తీస్తాయన్న విషయం పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే ఇలాంటి పాత్రలను వినియోగించకూడదు.
ప్లాస్టిక్ వస్తువుల వాడకం:
మీరు వంటగదిలో ప్లాస్టిక్ వంట సామాగ్రి వాడుతున్నారా? అయితే, జాగ్రత్త. ప్లాస్టిక్ పాత్రలు, సీసాలు, టిఫిన్ బాక్సులు వంటివి తయారుచేయడానికి బిస్ ఫినాల్ ఎ (BPA) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమైనది. BPA వల్ల మెదడు అభివృద్ధి, థైరాయిడ్ హార్మోన్‌లపై ప్రతికూల ప్రభావాలు చూపించడంతో పాటు, సంతానోత్పత్తి సమస్యలను కూడా కలిగించవచ్చు. అంతేకాకుండా, ఈ రసాయనం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు:
నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రాసెస్ చేసిన ఆహారాల వాడకం కూడా ఎక్కువవుతోంది. ఈ ఆహారాలలో అధిక మొత్తం ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు. తరచుగా ఈ ఆహారాలు తీసుకుంటే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
సారాంశం:
వంటగదిలో ఉపయోగించే పదార్థాలు, ఆహారాలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటితో ఎక్కువ సమయం గడిపి, శరీరంలో హానికరమైన రసాయనాలు చేరే అవకాశాలను తగ్గించడం ద్వారా హానికరమైన వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. మీకు మంచి ఆరోగ్యం కావాలనుకుంటే, ఈ విషయాలను జాగ్రత్తగా గమనించి, ఆరోగ్యకరమైన ఆహారం, సామాగ్రి ఉపయోగించే అలవాటు పెంచుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications