Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
డోంట్ వర్రీ: ఈ సంకేతాలు కనిపిస్తే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే!..
ఈ రోజుల్లో అంతా ఉరుకుల పరుగుల జీవితం,ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ నే ఎక్కువగా తినడం అలవాటుగా మారిపోయింది చాలామందికి. ఇక వ్యాయామం అంటారా..అది పేరు వినడం తప్ప పాటించేవాళ్లు తక్కువే. సరైనరీతిలో శారీరక శ్రమ లేకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తరచుగా పెరుగుతుంది. నిలబడినవాళ్లు నిలబడినట్లుగానే కూలిపోవడం, నడుస్తూ సడెన్ గా కిందపడి చనిపోవడం, పెళ్లి పంక్షన్స్ లో హాయిగా నవ్వుతూనే సడెన్ గా తూలిపోయి మరణించడం, జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోవడం వంటి అనేకమైన వీడియోలను మనం సోషల్ మీడియాలో లేదా వార్తలలో ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం.
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన, ప్రధానమైన అవయవాలలో గుండె ఒకటి. అలాంటి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)ప్రకారం ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. వీరిలో 85శాతం మంది గుండెపోటు, స్ట్రోక్ ల కారణంగా మరణిస్తున్నారు. అందువల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సంకేతాలు,లక్షణాల ద్వారా మీ గుండె ఆరోగ్యకరంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

మీ గుండె ఆరోగ్యంగా ఉందని తెలిపే సంకేతాలు ఇవే
కొలెస్ట్రాల్
సాధారణ కొలెస్ట్రాల్ లెవల్స్ ఆరోగ్యకరమైన గుండె సంకేతం. కాబట్టి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ కొలెస్ట్రాల్‌ను రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
గుండె ఇలా కొట్టుకుంటే
మీ గుండె క్రమం తప్పకుండా కొట్టుకుంటూ ఉంటే ఇది ఆరోగ్యకరమైన గుండెకు సంకేతం. క్రమరహిత హృదయ స్పందన చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా ఉంటే అది గుండె జబ్బుకు సంకేతం కాబట్టి చెడు సంకేతం కావచ్చు.
ఎనర్జీ
రోజు మొత్తం మీరు ఎనర్జిటిక్ గా ఇది మీ గుండెకు మంచి సంకేతం. హార్ట్ బ్లాక్ లేదా ఏదైనా ఇతర గుండె సంబంధిత సమస్య ఉన్న వ్యక్తులు అలసటను అనుభవించవచ్చు. ఇది అతని గుండె సరిగ్గా పనిచేయడం లేదని సంకేతం.
ఛాతీ నొప్పి
మీకు ఏదైనా రకమైన ఛాతీ నొప్పి ఉంటే అది హార్ట్ బ్లాక్‌కి సంకేతం కావచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీకు ఛాతీ నొప్పి రాకపోతే అది మీ గుండె ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం.
రక్తపోటు
మీ బిపిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. మీ బీపీ సాధారణంగా ఉన్నప్పుడు అది ఆరోగ్యకరమైన గుండెకు సంకేతం. మీ బిపి నార్మల్‌గా ఉంటే మీ ధమనులు సక్రమంగా పనిచేస్తున్నాయని,వాటిలో ఎలాంటి అడ్డంకులు లేవని సంకేతం.
ఇవి కూడా వాటి సంకేతమే
చేతులు, పాదాలు, పాదాలు, కాలు,చీలమండలలో వాపు లక్షణాలు గుండె జబ్బులకు సంకేతం. మీ గుండె సరిగ్గా పంప్ చేయలేకపోవటం, ఈ ప్రాంతాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
శ్వాస తీసుకోవడంలో
శ్వాస తీసుకోవడంలో మీకు ఎటువంటి సమస్య లేనప్పుడు..ఇది మీ గుండె ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. గుండె సంబంధిత వ్యాధుల విషయంలో శ్వాస తీసుకోవడం కష్టంగా మారవచ్చు. ఆక్సిజన్ గుండె, శరీరంలోని ఇతర భాగాలకు సరిగ్గా చేరకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications