Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ 6 రకాల ఆహారాలు విషంతో సమానం.. మనకు తెలియకుండానే మన ప్రాణాలు తీసేస్తున్నాయట!
ఈ మధ్య కాలంలో ప్రతీది కలుషితం అవుతుంది. మనం తినే ఆహరం నుంచి పీల్చే గాలి, తాగే నీటి వరకు ప్రతీది కలుషితమే. అలాంటి సందర్భాల్లో మనం తీసుకునే ఆహారం మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే, అవి మన శరీరానికి మంచి ప్రయోజనాలను అందజేస్తాయి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఎముకల బలాన్ని పెంచుతాయి. అయితే, ప్రస్తుత కాలంలో చాలామంది పోషకాలు లేని ఆహారాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అవి మనకు తెలియకుండానే మన శరీరంలో స్లో పాయిజన్‌లా మారిపోతున్నాయి. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాఫ్ట్ డ్రింక్స్
శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి చాలా తగ్గిపోతుంది. ఇందులో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం, శరీరంలోని కాల్షియం శోషణాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు. కాబట్టి, ఈ పానీయాలను పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.

ప్రాసెస్ చేసిన ఫుడ్
ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే, యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేస్తుంది. దీనివల్ల ఎముకల వ్యాధులు వస్తాయి, కావున ఈ రకమైన ఆహారాలను అధికంగా తీసుకోవడం నివారిస్తే చాలా ఉత్తమం.
టీ, కాఫీ
ఈ మధ్యకాలంలో చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరికి అవి లేకపోతే నిద్రపట్టదు కూడా. అయితే రోజూ ఎక్కువగా కాఫీ, టీ తాగడం వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు. ఇందులోని కెఫిన్ శరీరంలో కాల్షియం శోషణాన్ని తగ్గిస్తుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి హానికరం.
ఆల్కహాల్
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేసి, అవి తక్కువ బలంతో విరిగిపోతాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఆల్కహాల్‌ని తగ్గించడం లేదా మానడం ఉత్తమమైన ప్రయోజనాలను అందజేస్తుంది.
నూనె పదార్థాలు
నూనెలో ఎక్కువగా వండుకునే ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్‌లు, పకోడీలు వంటి పదార్థాలు శరీరంలో కొవ్వు స్థాయిని పెంచుతాయి. ఇవి ఎముకల్లో కాల్షియం శోషణ తగ్గించడం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. అందువల్ల వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.
ఉప్పు
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా మారవచ్చు. అందువల్ల, ఉప్పు తీసుకునే పరిమాణం నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ రకమైన ఆహారాలు ఎముకల ఆరోగ్యానికి హానికరంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్థాలను మానేయడం ఉత్తమమైన పద్ధతి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications