Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
డయాబెటిస్ వచ్చేముందు ఈ లక్షణాలు కనిపిస్తాయట.. మీకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయా?
ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. చాలా మంది ఈ వ్యాధితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో ఈ వ్యాధి పెద్ద సమస్యగా అనిపించకపోయినా.. దీర్ఘకాలంలో ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలోని అనేక అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపే అతిపెద్ద మహమ్మారిగా మారుతుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం ఏర్పడడం వలన, లేదా దానిని సరైన రీతిలో వినియోగించకపోయినా ఈ సమస్య వస్తుంది. రక్తంలో చెక్కెర స్థాయి అధికంగా పెరిగి.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే రకాలు ఉంటాయి. అదేంటంటే టైప్ 1, మరియు టైప్ 2 డయాబెటిస్. ఈ స్టోరీలో ఈ డయాబెటిస్ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం.
మధుమేహానికి కారణాలు ఏమిటి?
ఈ వ్యాధికి అనేక కారణాలు ఉండొచ్చు.. ముఖ్యంగా:
తప్పుడు ఆహారపు అలవాట్లు
శారీరక శ్రమ లేకపోవడం
స్థిరమైన జీవనశైలి
వంశపారంపర్యంగా మధుమేహ చరిత్ర
అధిక బరువు (ఊబకాయం)
హార్మోన్ల లోపం లేదా మందుల ప్రభావం
ఈ కారణాలు ఒక్కొక్కరి జీవనశైలిని బట్టి భిన్నంగా ఉండవచ్చు.

గర్భకాలంలో వచ్చే మధుమేహం
గర్భధారణ సమయంలో కొంతమందికి తాత్కాలికంగా మధుమేహం సమస్య రావచ్చు. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. సాధారణంగా ప్రసవానంతరం ఇది తగ్గిపోతుంది. కానీ, కొన్నిసార్లు ఈ పరిస్థితి తరువాత మళ్లీ మధుమేహంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణులు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి.
మధుమేహం రకాలు
టైప్ 1 మధుమేహం:
ఇది చిన్న వయసులోనే కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం సరిపడ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ మధుమేహం కలుగుతుంది. ఇది ఆకస్మాత్తుగా వస్తుంది.
టైప్ 2 మధుమేహం:
ఇది సాధారణంగా పెద్దలలో కనిపిస్తుంది. శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ రకమైన మధుమేహం అభివృద్ధి చెందుతుంది.
గర్భధారణ మధుమేహం:
గర్భిణులలో తాత్కాలికంగా కలిగే మధుమేహం. ఇది తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శాశ్వత మధుమేహంగా మారవచ్చు.
ప్రారంభంలో శరీరం ఇచ్చే సంకేతాలు
మధుమేహం అభివృద్ధి చెందే ముందు శరీరంలో కొన్ని హెచ్చరికల రూపంలో సంకేతాలు కనిపించవచ్చు. అవి:
తరచూ మూత్ర విసర్జన చేయడం
ఎక్కువ దాహం లేదా ఆకలి అనిపించడం
ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం
చేతులు, కాళ్లలో జారుడు లేదా నొప్పి
దృష్టి మసకబారడం
అలసట లేదా శక్తి లేకపోవడం
ఈ లక్షణాలు కనిపించినప్పుడు అవి సాధారణం అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య సలహా తీసుకొని తగిన పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం పూర్తిగా మాయం కాకపోయినా, దాన్ని సమర్థంగా నియంత్రించుకోవచ్చు. కొన్ని జీవనశైలి మార్పులతో దీన్ని అదుపులో పెట్టడం సాధ్యమే..
ఆహార నియంత్రణ: పంచదార, కొవ్వులు తగ్గించి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
నిరంతర వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా ఇతర శారీరక శ్రమ చేసుకోవాలి.
బరువు నియంత్రణ: ఆరోగ్యంగా ఉండే బరువును పాటించడం ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications