Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
థైరాయిడ్ పేషెంట్లు తినాల్సిన,తినకూడని ఆహారాలు ఇవే
ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ నిత్యం ఓ ట్యాబ్లెట్ వేసుకునేటోళ్లు మన చుట్టూ చాలామందిలో గమనించవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ తో బాధపడే మహిళల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి థైరాయిడ్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. మన గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథినే థైరాయిడ్ అని పిలుస్తారు. మనం తిన్న ఫుడ్ ని శక్తిగా ఎలా మార్చాలి, ఆ శక్తిని ఎంత వేగంగా ఖర్చు చేయాలి అనే కీలకమైన జీవక్రియను ఇదే నియంత్రిస్తుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడా వచ్చిందంటే హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతిని అకారణంగా బరువు పెరగడం, తీవ్రమైన అలసట, జుట్టు విపరీతంగా రాలిపోవడం, మానసిక ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు వంటివి స్టార్ట్ అవుతాయి. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం..రెండోది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో.. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయదు, ఫలితంగా జీవక్రియ నెమ్మదిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయి, జీవక్రియ అతివేగంగా పనిచేస్తుంది. ఈ రెండు పరిస్థితుల్లోనూ సరైన ఆహారం సంజీవనిలా పనిచేస్తుంది. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడటానికి, థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగించే ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు
అయోడిన్
థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఇది అత్యంత కీలకం. అయోడిన్ లోపం హైపోథైరాయిడిజానికి దారితీస్తుంది. మీ వంటలో అయోడైజ్డ్ ఉప్పు వాడటం చాలా ముఖ్యం. చేపలు, రొయ్యల వంటి సముద్రపు ఆహారాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది.
సెలీనియం
ఇది థైరాయిడ్ గ్రంథికి ఒక రక్షణ కవచంలా పనిచేసి దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్రెజిల్ నట్స్ రోజుకు 1-2, గుడ్లు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఇది అధికంగా ఉంటుంది.
జింక్
థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో జింక్ కూడా సహాయపడుతుంది. ఇందుకోసం పాలు, పెరుగు, గుమ్మడి గింజలు, పప్పుధాన్యాలు మీ డైట్ లో చేర్చుకోండి.
విటమిన్ B12, ప్రొటీన్
నీరసం, అలసటను జయించడానికి విటమిన్ బీ12 తప్పనిసరి. పాలు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోండి. పప్పుధాన్యాలు, పనీర్, సోయా, గుడ్లు, చికెన్ వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలంగా ఉంచి జీవక్రియను మెరుగుపరుస్తాయి.
ఈ ఆహారాలు థైరాయిడ్ శత్రువులు
పచ్చి కూరగాయలు
క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి వంటి వాటిని పచ్చిగా తినడం మానుకోండి. ఇవి థైరాయిడ్ పనితీరును తగ్గిస్తాయి. అయితే వీటిని బాగా ఉడికించి పరిమితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.
సోయా ఉత్పత్తులు
సోయా కొన్నిసార్లు మీరు వాడే థైరాయిడ్ మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు కాబట్టి డాక్టర్ ని సంప్రదించి మితంగా వాడండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
అధిక చక్కెర, మైదాతో చేసిన బేకరీ పదార్థాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ శరీరంలో మంటను పెంచి బరువు పెరగడానికి కారణమవుతాయి. వీటికి దూరంగా ఉండంటం బెటర్.
కెఫిన్, ఆల్కహాల్
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి మీ నిద్రను, హార్మోన్ల బాలెన్స్ ను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటిని తగ్గించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications