Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇలా చేస్తే..50 ఏళ్లు దాటినా కూడా కుర్ర పిల్లలా కనబడతారు
ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలామంది చిన్న వయస్సులోనే పెద్ద వయస్సు వారిలా కనబడుతున్నారు. దీనికి వారి జీవనశైలి,ఆహార అలవాట్లు ఇలా అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. ఇక,వయసు పెరుగుతున్న కొద్దీ తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారతుంది. మహిళలు ఇంట్లో అందరినీ చూసుకుంటారు కానీ తమను తాము చూసుకోవడం మర్చిపోతారు. మహిళల వయస్సు 50కి చేరుకోగానే శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. తన వయస్సు కంటే పెద్దదిగా మహిళ కనిపించడానికి కారణం ఇదే.
50 ఏళ్లు దాటిన మహిళలు మంచి డైట్ ఫాలో అవడం, మంచి దినచర్యను పాటించడం చాలా ముఖ్యం, తద్వారా వారు కూడా వయస్సుతో తమను తాము ఫిట్‌గా ఉంచుకోవచ్చు. 50 ఏళ్లు దాటిన మహిళలు తమ ఆరోగ్యాన్ని,అందాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా 50 ఏళ్లు దాటిన మహిళలు కూడా తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు తద్వారా ఆరోగ్యకరమైన,సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ చూడండి.

ఇలా చేస్తే 50 ఏళ్ల ఏజ్ లో కూడా 30 ఏళ్ల వ్యక్తిలా ఉంటారు
ఎక్సర్ సైజ్
క్రమం తప్పకుండా ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఎముకల బలం,కండరాల బలం, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయి. ఉదయం తేలికపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీకు ఉదయం సమయం దొరకకపోతే సాయంత్రం వ్యాయామం చేయండి.
మంచి,ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి,ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల మీ ఆహారంలో మంచి ఆహారం తీసుకోవడం, మీ ఫుడ్ ని మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం.
పుష్కలంగా నిద్రపోవాలి
తగినంత నిద్ర పొందడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. చాలా సార్లు నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో అనేక మార్పులు జరగడం ప్రారంభిస్తాయి..ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి
చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల చర్మం పొడిబారడం,ముడతలు తగ్గుతాయి. అందువల్ల మీ చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. స్కిన్ మీ ప్రెజెంటేషన్ అని గుర్తుంచుకోండి.
మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఒత్తిడి,ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి ట్రీట్మెంట్ చేయవచ్చు.
సోషల్ రిలేషన్స్
సామాజిక సంబంధాలను నిర్వహించడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications