Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
డయాబెటిస్‌తో హెయిర్ లాస్.. జుట్టు రాలకూడదంటే ఈ చిట్కాలు పాటించండి
ఈమధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో జుట్టు రాలుతోంది. చిన్న వయస్సు వారిలోనూ జుట్టు విపరీతంగా రాలుతోంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఒక రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలితే అది చాలా సాధారణం. దానికి చింతించాల్సిన అవసరం లేదు. కానీ, కొందరిలో విపరీతంగా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి మధుమేహం కూడా ఓ కారణమని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం జట్టు రాలిపోవడానికి కారణం!
మధుమేహం అనేది దీర్ఘకాలిక, జీవక్రియ వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెర అధిక స్థాయిల ద్వారా వర్గీకరించబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం.. మధుమేహం వల్ల కాలక్రమేణా కళ్లు, గుండె, మూత్రపిండాలు, రక్త నాళాలు, నరాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. జుట్టు రాలడానికి డయాబెటిస్ ఎలా కారణం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బలహీనమైన రక్త ప్రసరణ:
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. తలకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ ను జుట్టు కుదుళ్లకు అందకుండా చేస్తుంది.
2. హార్మోన్ల అసమతుల్యత:
మధుమేహం జుట్టు రాలడానికి దారితీసే హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. ఇన్సులిన్, ఆండ్రోజెన్ హార్మోన్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు, అవి జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి.
3. వాపు:
మధుమేహం శరీరంలో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
4. పోషకాహార లోపం:
డయాబెటిక్స్ ఉన్న వ్యక్తులు పోషకాహార లోపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. బయోటిన్, ఐరన్, జింక్ అధికంగా ఉన్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే జుట్టు రాలడం ఎక్కువవుతుంది.
5. ఒత్తిడి:
మధుమేహాన్ని నిర్వహించడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ఒత్తిడి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.
మధుమేహం నుంచి జుట్టు రాలడాన్ని నివారించే మార్గాలు
1. పోషకాహార లోపాలను సరిదిద్దాలి:
డయాబెటిక్ పేషెంట్లు పోషకాహార లోపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. తినే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండాలే చూసుకోవాలి.
2. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించాలి:
జుట్టు రాలడాన్ని నివారించడానికి శరీరంలో మంటను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఫాలో అవడం చాలా మంచిది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
3. హార్మోన్ల అసమతుల్యతను చెక్ చేసుకోవాలి:
డయాబెటిస్ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతను పరిష్కరించడానికి వైద్యులను సంప్రదించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











