Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శృంగారంలో పాల్గొంటే ఈ రోగాలు రావొచ్చు! ఈ చిట్కాలతో సేఫ్ సెక్స్ చేసుకోండి
శృంగారం ద్వారా కేవలం మజా మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. సేఫ్‌గా సెక్స్ చేయకపోతే రోగాల బారిన పడొచ్చు. లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు-STI శృంగారం ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్లు కొన్ని ప్రాణాలు కూడా తీస్తాయి.
రోగాలు వస్తాయని సెక్స్‌కు దూరంగా ఉండే బదులు ఇన్ఫెక్షన్లు రాకుండా ఎలా శృంగారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

STIలను ఎలా నివారించాలి:
* కండోమ్‌లు:
లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లను నివారించడానికి కండోమ్ లు అత్యంత ప్రభావవంతమైన మార్గం. సెక్స్ చేసే ప్రతీసారి కండోమ్ వాడటం అలవాటు చేసుకోవాలి.
* ఎక్కువ మందితో సెక్స్:
ఎక్కువ మందితో సెక్స్ చేస్తుంటే లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అంతగా పెరుగుతుంది.
* భాగస్వామిని అడిగి తెలుసుకోవడం:
సెక్స్ చేసే ముందు STI లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే కండోమ్ లాంటి రక్షిత శృంగారం చేయవచ్చు.
* పరీక్షలు చేయించుకోవడం:
కొందరికి లైంగిక వ్యాధులు ఉన్నా లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే తరచూ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో పరీక్షలు చేయించుకోవాలి.
సాధారణ లైంగిక వ్యాధులు:
* క్లామిడియా
* గొనేరియా
* సిఫిలిస్్
* హ్యూమన్ పాపిల్లోమావైరస్
* హెపటైటిస్ బి
* HIV/AIDS
లైంగిక వ్యాధులు లక్షణాలు:
వ్యాధిని బట్టి లక్షణాలు మారుతుంటాయి. క్లామిడియా, గొనేరియా వంటి కొన్ని ఎస్టీఐలు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. సిఫిలిస్ వంటి కొన్ని ఎస్టీఐలలో ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయి. HPV వంటి వ్యాధులు కూడా ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు కానీ గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
లైంగిక వ్యాధులకు చికిత్స:
చాలా STIలకు యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేస్తే సరిపోతుంది. లైంగిక వ్యాధులు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ముఖ్యం. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
STIలను నిరోధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కండోమ్ లు వాడటం, ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం వంటి వాటితో లైంగిక సక్రమణ వ్యాధుల నుండి దూరంగా ఉండొచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications