Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ల్యాప్‌టాప్, మొబైల్ చూసీ చూసీ కళ్లు బరువెక్కి నొప్పెడుతున్నాయా? అయితే ఇలా చేయండి
ఇప్పుడు నడిచేదంతా డిజిటల్ యుగం. ఫోన్ స్క్రీన్ చూడనిదే రోజు గడవడం లేదు. ల్యాప్‌టాప్ చూడనిదే పని సాగడం లేదు. కొందరు పని మధ్యలో వాటితో గడిపితే మరికొందరు పనిగట్టుకుని వాటితో గడుపుతుంటారు, ఇంకొందరు వాటితోనే పని చేస్తుంటారు. ఎలా అయినా డిజిటల్ స్క్రీన్ లను అదే పనిగా చూడటం వల్ల కళ్లు బరువెక్కి, నొప్పి పెడుతుంటాయి. కళ్ల వెనక లాగినట్లుగా కనిపిస్తుంది.
డిజిటల్ స్క్రీన్‌ల నుంచి వెలువడే బ్లూ లైట్ తీవ్రత పెరిగే కొద్దీ కళ్లపై ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది. కొంత మంది ల్యాప్‌టాప్‌లు వాడే వారు యాంటీ గ్లేర్, బ్లూ కట్ కళ్లద్దాలు వాడుతుంటారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మీక్కూడా డిజిటల్ స్క్రీన్‌లు చూసీ చూసీ కళ్లు బరువెక్కి నొప్పెడుతుంటే ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందండి.

ఐస్ క్యూబ్స్:
కళ్లపై ఒత్తిడి పడటం వల్ల కళ్ల నొప్పి, మంట వంటి ఇతర కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది. ఏం చేయాలంటే.. ఐస్ క్యూబ్స్ ను తీసుకుని కనురెప్పలపై పెట్టి సున్నితంగా, నిదానంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కంటి నొప్పి క్రమంగా తగ్గుతుంది. మంట తగ్గుముఖం పడుతుంది. కళ్లు బరువెక్కినట్లు కావడం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కంటి వ్యాయామం:
వ్యాయామం చేయడం వల్ల శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటుందో.. కంటి వ్యాయామాలు చేయడం వల్ల కళ్లు కూడా అలాగే ఆరోగ్యంగా ఉంటాయ. రకరకాల కంటి సమస్యలతో బాధపడే వారు కంటి వ్యాయామాలు చేయడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. కళ్లను గుండ్రంగా తిప్పడం, అటు ఇటు చూడటం, అరచేతిని కంటిపై ఉంచి సున్నితంగా వృత్తాకారంలో కదపడం వంటివి చేయాలి.
చల్లని పాలు, రోజ్ వాటర్:
చల్లని పాలు లేదా ఫ్రిజ్ నుంచి తీసిన రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ ముంచి వాటితో కంటిపై సున్నితంగా, నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా కాసేపు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications