Latest Updates
-
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే
శృంగారంలో తృప్తి పొందాలంటే పాలలో ఇది కలిపి తాగడండి..రాత్రంతా రగడే!
ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు అని నిపుణులు చెప్తుంటారు. పాలలో 87 శాతం నీరు,మిగిలిన 13 శాతం ప్రొటీన్లు,కొవ్వులు,కార్బోహైడ్రేట్లు,విటమిన్లు,మినరల్స్ ఉంటాయి. అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ ప్రకారం రోజుకు దాదాపు 250 గ్రాముల పాలు తాగాలి. ఇది శరీరంలో కాల్షియం లోపాన్ని నివారిస్తుంది,ఎముకలు విరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది. పాలు తీసుకోవడం వల్ల అనేక గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. బరువు తగ్గించడంలో, రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జిలేబి ఒక పాపులర్ ఇండియన్ స్వీట్. మనదేశంలోని అన్నిచోట్లా జిలేజీని ప్రజలు ఇష్టంగా తింటారు.
పాలు, జిలేబి కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలుంటాయని మీకు తెలుసా?ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ఆహార ప్రియులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది రుచికరమైన కలయిక మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వేడి పాలల్లో జిలేబి కలిపి తీసుకోడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ చూడండి.

జలుబు ,దగ్గు నుంచి రిలీఫ్
సాధారణంగా చలికాలంలో దగ్గు, జలుబు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే పాలు,జిలేబి కలయికతో వీటికి చెక్ పెట్టవచ్చు. పాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. జిలేబి శరీరానికి శక్తిని అందిస్తుంది. వేడి పాలలో జిలేబిని నానబెట్టి తినడం వల్ల జలుబు, దగ్గు మాత్రమే కాకుండా అనేక ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యకరమైన బరువు
చాలామంది తమ పిల్లలు బరువు పెరగట్లేదని,పెద్దలు కూడా కొందరు ఎంత తిన్నా తాము బరువు పెరగట్లేదని బాధపడుతుంటారు. అటువంటి వారికి పాలు జిలేబి కాంబినేషన్ అద్భుతమైన మార్గం. పాలలో ప్రోటీన్లు , ఇతర పోషకాలు ఉండగా..జిలేబిలో కేలరీలు , కొవ్వులు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే గ్లాసు పాలలో నెయ్యితో చేసిన జిలేబీని కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడుతుంది.
శృంగార సామర్థ్యం
చాలామంది జంటలు శృంగారలో పాల్లొనే సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల తరచుగా ఫీల్ అవుతుంటారు. అయితే శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడానికి పాలు జిలేబి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. పాలు, జిలేబి కలయిక శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది పురుషులలో వీర్యవృద్ధికి దోహదపడుతుంది. అలాగే స్త్రీలలో లైంగిక కోరికలను పెంచుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి , ఆనందాన్ని పెంచడానికి పాలు జిలేబి కలయిక సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గింపు
ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో పాలు జిలేబి కలయిక సహాయపడుతుంది. ఈ కలయిక మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. జిలేబీని తీసుకోవడం ద్వారా హై టెన్షన్, అల్జీమర్స్, స్ట్రోక్ వంటి వ్యాధుల నుండి బయట పడటానికి ఛాన్స్ ఉంటుంది.
తలనొప్పి,వాతం,ఆస్తమా
మీరు తరచుగా తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే ఉదయాన్నే పాలతో జిలేబీని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. రెండు మూడు వారాల పాటు సూర్యోదయానికి ముందు జిలేబీని నిరంతరం తినడం వల్ల శరీరంలోని వాత దోషం నుండి బయటపడవచ్చు. గోరువెచ్చని పాలలో నానబెట్టిన జిలేబీని తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు.
వీరు మాత్రం తీసుకోకూడదు
డయాబెటిస్ పేషెంట్లు మాత్రం దీనిని తీసుకోకూడదు. ఎందుకంటే జిలేబీలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ,గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అయితే ఒక్కొక్కరి శరీర తీరు ఒక్కోలా ఉంటుంది కాబట్టి దీనిని పాటించేముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications