Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బాదం తొక్కతో తినాలా? తొక్క తీసేయాలా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!
బాదంపప్పు పేరు వినగానే కొంతమందికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. బాదంపప్పు డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా పిలవబడుతుంది. రోజూ కొన్ని బాదం పప్పులను తినడం వల్ల మన శరీరం, మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తాయని నిపుణులు తరచుగా చెబుతుంటారు. చాలామందికి ఉదయాన్నే నానబెట్టిన బాదం తినే అలవాటు ఉంటుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం తలెత్తుతుంది. బాదం పప్పును తొక్కతో పాటు తినాలా, లేక తొక్క తీసి తినాలా? ఈ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
తొక్కతో తింటే లాభాలేంటి?
బాదం పప్పులోనే కాదు, దాని తొక్కలో కూడా అమోఘమైన పోషకాలు దాగి ఉన్నాయి. బాదం పప్పులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే బాదం తొక్క ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కవచంలా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో పేరుకుపోయే ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన కణాలపై పోరాటం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి అనేక ప్రమాదకరమైన పెద్ద వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.

అంతేకాకుండా తొక్కతో పాటు బాదం తినడం వల్ల శరీరానికి అదనపు ఫైబర్ అందుతుంది. ఇది మన జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు బాదంను తొక్కతో పాటు తినడమే మంచిది.
తొక్క తీసేయడం ఎప్పుడు మంచిది?
నాణేనికి మరోవైపు ఉన్నట్లే కొందరికి బాదం తొక్క ప్రయోజనకరం కాకపోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి బాదం తొక్కను అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు తొక్కతో తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. బాదం తొక్కలో టానిన్ అనే ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది బాదంలోని పోషకాలను మన శరీరం పూర్తిగా గ్రహించకుండా కొంతమేర అడ్డుకుంటుంది. బాదం పప్పును రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే దాని తొక్కను తీసివేసినప్పుడు ఈ టానిన్ కూడా తొలగిపోతుంది. దీనివల్ల బాదంలోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. అందువల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బాదం తొక్కను తీసివేసి తినడం ఉత్తమమైన పద్ధతి.
బాదం ఆరోగ్య ప్రయోజనాలు
-ఇందులో ఉండే విటమిన్ ఇ, మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తికి పదును పెడుతుంది.
-రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- బాదంలోని ఫైబర్, ప్రోటీన్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల అతిగా తినడాన్ని నియంత్రించి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.
-బాదం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది, కాబట్టి మధుమేహ రోగులకు ఇది మంచి స్నాక్.
- యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications