టమాట ధర పైపైకి.. టమాటాకు టాటా చెబుతున్న లేడీస్, చింతపండు, టమాటా పేస్ట్,వెనిగర్, నిమ్మరసం వైపు చూపులు..

Tomato Substitutes: టమాటా లేకుండే నేటి మహిళలు ఎలాంటి కూరలు వండటానికి ఇష్టపడరు. మాంసాహారం, శాఖాహారం ఇలా తేడాలు లేకుండా ప్రతి కూరలో టమాటా దాదాపుగా ఉపయోగిస్తారు. కొన్ని సందర్బంగా రూ. 5 నుంచి రూ. 10 విక్రయించిన టమాటాలు ఇప్పుడు ఏకంగా సెంచురి దాటేసింది. కొన్ని సిటీల్లో టమాట రూ. 180 వరకు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా టమాటా పండించే ప్రాంతంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె (గతంలో చిత్తూరు జిల్లాలో మదనపల్లె ఉండేది) గుర్తింపు తెచ్చుకుంది. మదనపల్లె నుంచి తమిళనాడులోని చెన్నైకి, రాయలసీమాలోని అనేక ప్రాంతాలతో పాటు కర్ణాటకకు టమాటాలు సరఫరా చేస్తుంటారు.

Tomato Substitutes: Tomato prices sky high in market, Ladies try this instead of tomato

మదనపల్లె ఆర్ టీసీ డిపో బస్సుల మీద టమాటా సింబల్ ఉంటుంది అంటే మదనపల్లె పరిసర ప్రాంతాల్లో టమాటా పంటను ఎన్ని లక్షల ఎకరాల్లో టమాటా పండిస్తారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టమాటాలు మదనపల్లె మార్కెట్ లో బుధవారం 30 కేజీల నాణ్యమైన టమాటాల బాక్స్ రూ. 2, 800 నుంచి రూ. 3, 330 వరకు పలకడంతో ఒక పక్క రైతులు, మార్కెట్ లోని మండీల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే సామాన్య మహిళలు టమాటాలు కొనుగోలు చెయ్యలేక, రుచికరమైన వంటలు చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటాలకు హెడ్ క్వాటర్ అయిన మదనపల్లెలోనే టమాటాలు కేజీ రూ. 130 పలుకుతున్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో టమాటాలు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. టమాటాలు పండిస్తున్న రైతులు, టమాటా మండీల వ్యాపారులు ఇప్పుడు లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లోని హోటల్ యాజమాన్యం టమాటాలు వాడకాన్ని వీలైనతం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. టమాటాలకు బదులుగా ఇప్పుడు చింతపడు ఉపయోగించుకోవాలని హోటల్ యాజమాన్యాలు, సామాన్య మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక చింతపండుకు ఎంతో ప్రసిద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో కూడా చింతపండు ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు టమాటాల ధరలు కూడా ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బ తినడటం, వర్షాకాలం వస్తుందని టమాటా పంటలు పండించడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడంతో ప్రస్తుతం టమాటా పంటలు వేసిన రైతులకు నిజంగానే పంటపండింది. అయితే ఇప్పుడు కనుక భారీ వర్షాలు కురిస్తే టమాటా ధరలు రూ. 200 నుంచి రూ. 250 ధర దాటినా ఆశ్చర్యం లేదని కొందరు రైతులు, వ్యాపారులు అంటున్నారు.

టమాటాలు లేకుండా వంటలు చెయ్యడం ఎలా అంటూ మహిళలు ఆలోచనలో పడ్డారు. గతంలో ఇష్టం వచ్చినట్లు టమాటాలు కూరలకు వాడేసిన మహిళలు ఇప్పుడు అలర్ట్ అయ్యారు.టమాటా ధరలు పెరిగిపోవడంతో పలు కంపెనీల టమాటా రెడీమేడ్ పేస్ట్ లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. సిటీలు, రద్దీగా ఉండే పట్టణాల్లో టమాటాలు కొనడం మానేసిన చాలా మంది మహిళలు ఇప్పుడు టమాటా పేస్ట్, టామాటా బాత్ కు ఉపయోగించే రెడీమేడ్ ప్యాకెట్లు తెగ కొనేస్తున్నారు. ఇవి కాకుండా మరో 5 ఉత్తమ ప్రత్యామ్నాయాలు క్రింది విధంగా ఉన్నాయి.

Tomato Substitutes: Tomato prices sky high in market, Ladies try this instead of tomato

1. యాలకుల పొడి
యాలకుల పొడి మంచి పులుపు మరియు తీపి రుచి మరియు తక్కువ ధర కూడా. మీరు మీ గ్రేవీ లేదా ఇతర వంటలలో వండేటప్పుడు ఈ యాలకుల పొడిని ఒక టీస్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ జోడించవచ్చు. ఇది ఖచ్చితంగా డిష్‌కి మీరు వెతుకుతున్న పుల్లని రుచిని ఇస్తుంది.

2. చింతపండు
టమాటా కంటే పుల్లని రుచి ఎక్కువగా ఉండే పదార్థం చింతపండు. చింతపండు, సాంబారు మొదలైన వాటిలో టొమాటోకు బదులుగా చింతపండు రసాన్ని మాత్రమే వాడితే వంటకం బాగుంటుంది. అలాగే చింతపండు రసం గ్రేవీకి చక్కని రంగును ఇస్తుంది. కాబట్టి టొమాటోకు బదులుగా చింతపండును ఉపయోగించవచ్చు.

3. పులియబెట్టిన పెరుగు
భారతీయ వంటలలో, టొమాటో-ఆధారిత వంటకాలు టమోటాలకు ప్రత్యామ్నాయంగా పులియబెట్టిన పెరుగును ఉపయోగిస్తాయి. గ్రేవీ లేదా గ్రేవీలో పెరుగు కలిపితే, గ్రేవీ కొంచెం చిక్కగా మరియు చక్కని పుల్లని రుచిని కలిగి ఉంటుంది. అయితే దాని కోసం మీరు ఉడికిన తర్వాత పెరుగును కదిలించాలి.

4. గూస్బెర్రీ
టొమాటోలకు ప్రత్యామ్నాయంగా జామకాయను ఉపయోగించవచ్చు. కానీ జామకాయ కొంచెం పుల్లని రుచిని కలిగి ఉంటుంది కాబట్టి దానిని ఉపయోగించేటప్పుడు పరిమాణంతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు వంటలో జామకాయను ఉపయోగిస్తుంటే, జామకాయ ముక్కలను పంచదార కలిపిన నీటిలో కాసేపు నానబెట్టి వాటిని మెత్తగా చేసి, ఆపై వాటిని వంటలో చేర్చండి.

5. వెనిగర్
టమోటాల పక్కన, వెనిగర్ ఒక ప్రత్యేకమైన పుల్లని రుచిని కలిగి ఉన్న మరొక పదార్ధం. యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు పేగు ఇన్ఫెక్షన్లు, డయేరియా, జీర్ణ సమస్యలు మొదలైన వాటి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion