Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
పూర్వీకుల వైద్యం..అరిటాకు స్నానంతో అంతులేని ప్రయోజనాలు
ఏటికేడు మనుషుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మారిన ప్రజల జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య ఇబ్బందులు,మానసిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఈ రోజుల్లో స్నానం చేయడం దగ్గర నుంచి తలకు పెట్టుకునే ఆయిల్ దాకా రసాయనాలతో కూడా ఉత్పత్తులను వాడటం కామన్ అయిపోయింది. చర్మంపై, ఆరోగ్యంపై ఇవి చూపెట్టే ప్రభావం గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి సిద్ధమైన పద్ధతులను పాటించడం చాలా ఉత్తం. అలాంటి అద్భుతమైన పద్థతుల్లో అరిటాకు స్నానం ఒకటి.
అరిటాకు స్నానం అంటే అరిటాకలను పైన కప్పుకొని సూర్యరశ్మికి గురికావడం ద్వారా చేసే ఒక ట్రీట్మెంట్ పద్ధతి. ఈ పద్ధతిలో అరిటాకులోని ఔషధ గుణాలాన్నీ శరీరానికి అందుతాయి. ప్రధానంగా అరిటాకుల్లో అధికంగా ఉండే క్లోరోఫిల్..సూర్యరశ్మి సమక్షంలో శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సాయపడుతుంది. అరిటాకు స్నానం కేవలం మనసుకు ప్రశాంతత ఇవ్వడమే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. కొన్ని ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ చూడండి.

అరిటాకు స్నానం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు
శరీరంలోని విషపదార్థాల తొలగింపు
అరిటాకు స్నానం చర్మ రంధ్రాలను తెరచి చెమట ద్వారా శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది ఒక రకమైన డీటాక్సిఫికేషన్ గా పనిచేస్తుంది.
చర్మ సౌందర్యం
అరటి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది.
మానసిక ప్రశాంతత
ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల కలిగే ప్రశాంతత అరిటాకు స్నానంలోనూ అనుభవించవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి మనసుకు విశ్రాంతినిస్తుంది. ఆందోళన, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రత నియంత్రణ
ఎండాకాలంలో బాడీ టెంపరేచర్ ని తగ్గించడానికి అరిటాకు స్నానం సహాయపడుతుంది. అరటి ఆకులకు సహజంగా చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది.
శరీర దురదలు, దద్దుర్లు
అరిటాకులలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఏర్పడే దద్దుర్లు, దురదలు, చిన్నపాటి అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఎలా చేయాలి?
ఒక ప్రశాంతమైన ప్రదేశంలో నేరుగా సూర్యరశ్మి పడే చోట పెద్ద అరటి ఆకులను పరుచుకోవాలి. వాటిపై పడుకుని శరీరం మొత్తం ఆకులతో కప్పుకోవాలి. పైన ఆకులను ఏదైనా తాడుతో కొంచెం లూజ్ గానే కట్టండి. పు అలాగే అరిటాకు లోపల పడుకొని ఉండండి. తర్వాత అరిటాకులను తీస్తే భయంకరమైన దుర్వాసన వస్తుంది. శరీరంలోని మలినాలు అన్నీ బయటకు పోయినట్లేనని దానర్థం. ఆ తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. అరిటాకు స్నానం అనేది ఒక సంప్రదాయ పద్ధతి. దీనిని క్రమం తప్పకుండా ఆచరిస్తే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications