Latest Updates
-
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్‌లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇక ఆ సమస్యే ఉండదు.!
సీజన్ ఏదైనా కొందరు అమ్మాయిలు ఫ్యాషన్‌కి అనుగుణంగా స్లీవ్‌లెస్ ధరించడానికి ఇష్టపడతారు. కాలేజ్, పార్టీలు, ఆఫీసు, వెకేషన్.. సిట్యుయేషన్ ఏదైనా తగిన రీతిలో స్లీవ్‌లెస్‌ను ఇష్టంగా ధరిస్తారు. అయితే స్లీవ్‌లెస్ ధరించాలంటే చంక భాగాలు నీటుగా ఉండటం తప్పనిసరి. నల్లగా ఉన్నా, కందిపోయినట్లు ఉన్నా.. అది డ్రెస్సింగ్‌తో పాటు మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే చంక భాగాలను తరచూ క్లీన్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో తెలిసీతెలియక చేసే పొరపాట్ల ద్వారా చంక భాగాలు నల్లగా మారతాయి. వాటిని ఎలా నివారించాలో చూద్దాం..

స్లీవ్‌లెస్ ధరించినా ధరించకోపోయినా.. చంక భాగాల్లో పెరిగిన వెంట్రుకలు తొలగించుకోవడానికి తరచూగా షేవింగ్ చేసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో నిరంతరం రాపిడి చేయడం, బిగుతైన దుస్తులు ధరించడం, మృత చర్మ కణాలు పేరుకుపోవడం, షేవింగ్‌లో భాగంగా కఠినమైన కెమికల్ డియోడరెంట్లు వాడటం, ఊబకాయం, హార్మోన్ల మార్పులు ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల చంక భాగాల్లో నల్లగా మారుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా చంక భాగాలు నల్లగా మారవచ్చు. ఈ సమస్యకు సరైన కారణాన్ని గుర్తించి, సరైన చర్మ సంరక్షణ చర్యలు పాటించడం, కొన్ని సాధారణ అలవాట్లు మార్చుకోవడం ద్వారా నల్లటి చంకల సమస్యను తొలగించవచ్చు.
ఎక్స్‌ఫోలియేట్, మాయిశ్చరైజర్
వారానికి ఒకటి లేదా రెండుసార్లు చంక భాగాల్లో తేలికగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా ఈజీగా శుభ్రం అవుతుంది. మృత చర్మాన్ని సులభంగా తొలగిస్తుంది. అనంతరం చర్మం మృదువుగా ఉండేందుకు సువాసన లేని మాయిశ్చరైజర్‌ను వాడటం మంచిది. చంక భాగాల్లో వెంట్రుకలను తొలగించేందుకు అతిగా రుద్దకండి.. దీని ద్వారా చికాకు కలగవచ్చు. సున్నితంగా ఉంచుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా సంరక్షణ చేయడం, చర్మ ఆకృతి, ఛాయలో మెరుగుదల కనిపిస్తుంది.

షేవింగ్ కంటే ఇది ఉత్తమం..
చంక భాగాల్లో తరచూ షేవింగ్ చేయడం వల్ల చర్మంపై రాపిడి పెరుగుతుంది. షేవింగ్‌తో వెంట్రుకలు కుదుళ్లు పూర్తిగా తొలగిపోకపోవడంతో నల్లగా కనిపిస్తాయి. ట్రిమ్మింగ్, వాక్సింగ్, ఇతర సురక్షితమైన పద్ధతులు శ్రేయస్కరం. ఆల్కహాల్, ఘాటైన సువాసనలు కలిగిన డియోడరెంట్లకు బదులుగా, సున్నితమైన చర్మం కోసం తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకుంటే శ్రేయస్కరం..

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కలబంద జెల్ వంటి సున్నితమైన వాటి ద్వారా చంక భాగాల్లో చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. కానీ నిమ్మరసం, బేకింగ్ సోడా, టూత్ పేస్ట్, బ్లీచ్ వంటి వాటిని నేరుగా చంకలపై పూయడం మానుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారా చర్మానికి హాని కలగడమే కాకుండా నల్లదనం మరింత పెరగవచ్చు. చంక భాగాల్లో నలుపు పోయేందుకు, సాఫ్ట్‌గా ఉండేందుకు కొత్త ఉత్పత్తులు ఏమైనా ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం. ఏవైనా అలర్జీ, తేడాలు గమనించినట్లయితే వెంటనే చర్మ నిపుణుడిని సంప్రదించడం మేలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
