పంటి నొప్పి నరకం చూపిస్తోందా? బ్రహ్మాస్త్రం పనిచేసే వంటింటి చిట్కాలు

ఏ నొప్పినైనా భరించొచ్చు గానీ పంటినొప్పు మాత్రం భరించలేరు అంటారు చాలామంది. పంటి నొప్పి మన దినచర్యను పూర్తిగా స్తంభించిపోయేలా చేస్తుంది.. నిద్రపట్టదు, ఆహారం తినలేం, కనీసం ప్రశాంతంగా మాట్లాడలేం. కావిటీస్ (పిప్పి పన్ను), చిగుళ్ళ వాపు, వేడి లేదా చలి పదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం, పగిలిన దంతాలు లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల ఈ నొప్పి రావచ్చు.

తీవ్రమైన సమస్యలకు టెంటిస్ట్ ని సంప్రదించడం తప్పనిసరి అయినప్పటికీ రాత్రివేళల్లో లేదా డాక్టర్ అందుబాటులో లేనప్పుడు వచ్చే ఆకస్మిక, తేలికపాటి నొప్పిని తగ్గించుకోవడానికి మన వంటింట్లోని సహజ సిద్ధమైన పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. పంటి నొప్పిని తరిమికొట్టే ఆ శక్తివంతమైన చిట్కాలు ఏంటో ఇక్కడ చూడండి.

Unbearable Toothache Powerful Home Remedies for Tooth Pain You Need to Know

లవంగం నూనె
పంటి నొప్పికి పూర్వకాలం నుండి వాడుతున్న దివ్యౌషధం లవంగం. ఇందులో ఉండే యూజినాల్ అనే రసాయనం సహజ అనస్థీషియాగా పనిచేస్తుంది. ఒక చిన్న దూది ఉండను లవంగం నూనెలో ముంచి, నొప్పి ఉన్న పన్ను లేదా చిగురుపై ఉంచండి. ఇది కొన్ని నిమిషాల్లోనే ఆ ప్రదేశాన్ని మొద్దుబారేలా చేసి నొప్పిని తగ్గిస్తుంది.

ఉప్పు నీటి పుక్కిలింత
గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి ఆ నీటిని నోటిలో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, చిగుళ్ళ వాపు తగ్గుతుంది. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార వ్యర్థాలు బయటకు వస్తాయి.

జామ ఆకులు
తాజా జామ ఆకులను శుభ్రంగా కడిగి నమలడం లేదా వాటిని నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలించడం వల్ల చిగుళ్ళ వాపు, నొప్పి తగ్గుతాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లి పేస్ట్
వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు మెండుగా ఉంటాయి. వెల్లుల్లిని దంచినప్పుడు విడుదలయ్యే అల్లిసిన్ అనే పదార్థం బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బను మెత్తగా నూరి, ఆ పేస్ట్‌ ను నొప్పి ఉన్న చోట పెడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. నొప్పి ఉన్నప్పుడు తాజా ఉల్లిపాయ ముక్కను నొప్పి ఉన్న పన్నుతో నెమ్మదిగా నమలండి. దాని నుండి వచ్చే రసం ఆ ప్రాంతంలోని క్రిములను చంపి ఉపశమనాన్ని ఇస్తుంది.

పసుపు
పసుపు సహజమైన యాంటీ బయోటిక్. కొద్దిగా పసుపు పొడిని నీటితో లేదా ఆవ నూనెతో కలిపి పేస్ట్‌ లా చేసి నొప్పి ఉన్న చోట రాయండి. ఇది వాపును తగ్గించి, ఇన్ఫెక్షన్‌ ను నివారిస్తుంది.

అల్లం, మిరపకాయల పేస్ట్

అల్లం, ఎర్ర మిరపకాయ పొడిని సమపాళ్లలో తీసుకుని, నీటితో పేస్ట్‌ లా చేయండి. దీనిని చిన్న దూది ఉండపై ఉంచి చిగుళ్లకు తగలకుండా కేవలం నొప్పి ఉన్న పన్నుపైనే ఉంచండి. ఇది వేడిని పుట్టించి మెదడుకు చేరే నొప్పి సంకేతాలను అడ్డుకుంటుంది.

ఒకవేళ నొప్పి 2-3 రోజుల కంటే ఎక్కువ ఉన్నా, వాపు ముఖం అంతా వ్యాపించినా, లేదా నొప్పితో పాటు జ్వరం వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డెంటిస్ట్ ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, December 8, 2025, 8:02 [IST]
Desktop Bottom Promotion