Latest Updates
-
సిద్ధ యోగం ప్రారంభం: ఈ రాశుల వారికి తిరుగేలేదు.. పనులు సక్సెస్ అవ్వాలంటే ఇలా చేయండి! -
వర్షాకాలంలో అదరగొట్టే ప్రకృతి అందాలు.. టూర్ ప్లాన్ చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
మన ప్రార్థనలు భగవంతుడికి ఎలా చేరుతాయి? శాస్త్రాలు చెప్పే విశేషాలు -
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా? -
తుల, ధనుస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 25 జూన్ 2026 -
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.!
మీ మూత్రం ఏ రంగులో ఉంది? డార్క్ ఎల్లో, పింక్ కలర్‌లో ఎందుకుంటుందో తెలుసా?
మూత్రం రంగు ఆరోగ్యం గురించి చాలా చెబుతుంది. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. శరీరం ఉండాల్సినంత హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు మూత్రం లేత పసుపు రంగులో కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల వల్ల మూత్రం రంగు మారుతుంది. రోజు ఎంత నీరు తాగుతున్నాం, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఒంట్లో తలెత్తే సమస్యల ఆధారంగా మూత్రం రంగు మారుతుంది. ఎలాంటి టెస్టులు అవసరం లేకుండా మూత్రాన్ని చూసి ప్రాథమిక అంచనాకు రావొచ్చని చెబుతున్నారు వైద్యులు. కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పరీక్షలు చేయాల్సిందే.

పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో, పూర్తి స్థాయిలో హైడ్రేటెడ్ గా ఉన్న వ్యక్తుల్లో మూత్రం పసుపు రంగులో ఉంటుంది. అయితే మూత్రం రంగులు ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి, యూరిన్ వాసన చెప్పే ఆరోగ్య సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డార్క్ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్‌లో మూత్రం:
ముదురు పసుపు లేదా నారింజ రంగులో మూత్రం వస్తుంటే.. కాలేయ పనితీరులో సమస్యలు ఉన్నాయని లేదంటే కామెర్లు ఉన్నట్లు సూచిస్తుంది. మూత్రం రంగు మారాలంటే అధికంగా నీటిని తీసుకుంటే సరిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. డార్క్ ఎల్లో లేగా ఆరెంజ్ కలర్ యూరిన్ వస్తుంటే కామెర్లు వచ్చాయని బలమైన సూచనగా భావించవచ్చు. ఇలాంటి మూత్రం వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి మూత్ర, రక్త పరీక్షలు చేయించుకోవాలి.
2. రెడ్ కలర్‌లో మూత్రం:
ఎరుపు రంగు మూత్రం రక్తాన్ని సూచిస్తుంది. ఇది మూత్ర ఇన్ఫెక్షన్, యూరినరీ స్టోన్స్, యూరినరీ క్యాన్సర్ వల్ల ఇలా ఎరుపు రంగులో మూత్రం రావొచ్చు. యూరిన్ ఇలా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కాస్త ఆలస్యం అయినా పరిస్థితి తీవ్రం కావొచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
3. డార్క్ పర్పుల్ మూత్రం:
ముదురు ఊదా రంగులో మూత్రం వస్తుంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ కావొచ్చు. దీనిని పర్పుల్ బ్యాగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. తగిన యాంటీబయోటిక్స్ వాడితే సమస్య పరిష్కారం అవుతుంది. మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించాలి. వారి సిఫార్సు మేరకు చికిత్స తీసుకోవాలి
4. పింక్ కలర్‌లో మూత్రం:
బీట్‌రూట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మూత్రం పింక్ కలర్ లో రావొచ్చు. కొన్ని సార్లు లేత ఎరుపు రంగులో కూడా ఉండొచ్చు. మూత్రం ఇలా కనిపిస్తుంటే బీట్‌రూట్‌ను మితంగా తినాలని గుర్తుంచుకోవాలి. బీట్‌రూట్ లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మంచివే అయినప్పటికీ.. అతిగా తినడం వల్ల అనర్థాలే వస్తాయని గుర్తుంచుకోవాలి.
5. మిల్కీ వైట్‌లో మూత్రం:
మూత్రం మిల్కీ వైట్‌లో వస్తుంటే యూరిన్‌లో కొవ్వు చేరిందని అర్థం చేసుకోవాలి. వుచెరేరియా బాన్‌క్రోప్టీ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ప్రజల్లో మిల్కీ వైట్ లో మూత్రం ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రం ఇలా మిల్కీ వైట్ లో వస్తుంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
6. గ్రీన్ కలర్‌లో మూత్రం:
సూడోమోనాస్ అని పిలిచే బ్యాక్టీరియా వల్ల మూత్రం ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఆస్పరాగన్, కొన్ని తినదగిన రంగులు తీసుకోవడం వల్ల కూడా మూత్రం ఆకుపచ్చ రంగులో వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications