Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Blood Group Diet: ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడండి
ఆరోగ్యంగా ఉండే ఏదో ఒక పని చేసుకు బతకొచ్చు బిడ్డా మన పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్లు. ఆరోగ్యం ఇబ్బంది అయితే కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నా సరే వృద్ధానే. కాబట్టే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ప్రస్తుతం మారిన జీవన పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. వ్యాయామం, యోగాతో పాటు బ్యాలెన్డ్ ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే మనందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు కదా?
మన రక్త వర్గాలను బట్టి మన శారీరక నిర్మాణం, జీర్ణవ్యవస్థ పనితీరులో కూడా తేడాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందరూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కంటే మన బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్త వర్గాన్ని బట్టి ఆహారం తీసుకోవడం అనే ఈ కొత్త విధానం, మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. మరి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ చూడండి.

A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ఇవి తినండి
A గ్రూప్ రక్తం ఉన్నవారికి శాకాహారం ఎక్కువగా మేలు చేస్తుంది. వీరి జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. బ్లూబెర్రీ, నేరేడు, చెర్రీ, ద్రాక్ష వంటి పండ్లు..గుమ్మడి కాయ, క్యారెట్, బ్రోకోలి వంటి కూరగాయలు ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయి. వీటితో పాటు గుడ్లు, సోంపు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అయితే వీరు జీర్ణక్రియకు కొద్దిగా ఇబ్బంది కలిగించే బీన్స్, వంకాయలు, టమాటాలను వీలైనంత తక్కువగా తీసుకోవడం బెటర్.
B బ్లడ్ గ్రూప్
B బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల జీర్ణవ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. వీళ్లు శాకాహారం, మాంసాహారం రెండింటినీ సులభంగా జీర్ణం చేసుకోగలరు. బీట్‌రూట్, ద్రాక్ష, పెరుగు, కాటేజ్ చీజ్, బాదం, మిరియాలు, వంకాయ వంటివి తరచుగా తీసుకోవాలి. మాంసాహారంలో మటన్, కిడ్నీ బీన్స్, ఆవు పాలు వంటివి వీరికి మంచి శక్తినిస్తాయి. అయితే చికెన్, మొక్కజొన్న, ఇతర పప్పు ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.

AB బ్లడ్ గ్రూప్
ఈ బ్లడ్ గ్రూప్ A, B గ్రూపుల కలయిక కాబట్టి వీరి ఆహారపు అలవాట్లు కూడా మిశ్రమంగా ఉండాలి. రెడ్ వైన్ (మితంగా), మటన్, గుడ్లు, పెరుగు, పాలు, పీనట్ బటర్, వెల్లుల్లి, అంజీర్, పప్పులు, ఆక్రోట్లు, కాలీఫ్లవర్, పుచ్చకాయ వంటివి వీరికి చక్కగా సరిపోతాయి. ఈ ఆహారాలు వీరి జీవక్రియను మెరుగుపరిచి, శక్తిని అందిస్తాయి. అయితే చికెన్, అరటి పండ్లు, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాలకు బైబై చెప్పడం మంచిది.
O బ్లడ్ గ్రూప్
O గ్రూప్ వారి జీర్ణవ్యవస్థ ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. వీరికి మాంసాహారం బాగా మేలు చేస్తుంది. చికెన్, మటన్, చేపలు వంటివి తీసుకోవడం వల్ల వీరు యాక్టివ్ గా ఉంటారు. వీటితో పాటు వెన్న, బాదం, అల్లం, ఉల్లిపాయలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, అరటి పండ్లు, మామిడి కాయలు ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీ బీన్స్, సోయాబీన్ ఆయిల్, గోధుమ పిండితో చేసిన పదార్థాలను తగ్గించడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications