Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తల్లిదండ్రులూ అలర్ట్..ఈ సిరప్ మీ ఇంట్లో ఉంటే వెంటనే పారేయండి..తెలంగాణలో బ్యాన్
సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉండి,వారికి జలుబు,దగ్గు లేదా అలర్జీలు వస్తే డాక్టర్ల సూచనల మేరకు సిరప్ లను వాడుతుంటాం. అయితే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఒక ప్రమాదకరమైన సిరప్ ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్(TGDCA) అధికారులు గుర్తించారు.
ఆల్మంట్ కిడ్(Almont-Kid) అనే సిరప్ లో విషపూరిత రసాయనాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సిరప్ ల వాడకం, అమ్మకాలపై నిషేధం విధిస్తూ శనివారం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది?
కోల్ కతాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుండి తెలంగాణ అధికారులకు ఒక కీలక హెచ్చరిక వచ్చింది. బీహార్ లోని ట్రైడస్ రెమెడీస్ అనే సంస్థ తయారు చేసిన ఒక బ్యాచ్ సిరప్ లో ఇథిలీన్ గ్లైకాల్(Ethylene Glycol) అనే ప్రమాదకర రసాయనం కల్తీ అయినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈ రసాయనం సాధారణంగా యాంటీఫ్రీజ్ లో వాడుతారు. ఇది మందుల్లో ఉంటే ప్రాణానికే ముప్పు.
గుర్తుంచుకోవాల్సిన సిరప్ వివరాలు
మీ దగ్గర ఉన్న సిరప్ బాటిల్ ను వెంటనే చెక్ చేసుకోండి. ప్రమాదకరమైన బ్యాచ్ వివరాలు ఇవే.
సిరప్ పేరు: ఆల్మంట్-కిడ్ సిరప్ (Almont-Kid Syrup).
మందుల మిశ్రమం: లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం.
బ్యాచ్ నంబర్: AL-24002.
తయారీ తేదీ: జనవరి 2025.
గడువు తేదీ: డిసెంబర్ 2026.
ఎంత ప్రమాదకరం?
ఇథిలీన్ గ్లైకాల్ అనేది పిల్లల శరీరంలోకి వెళితే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ఇది ప్రధానంగా కిడ్నీలను దెబ్బతీస్తుంది. మెదడుపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది.
సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందుకే అధికారులు దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.
అధికారుల చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, హాస్పిటల్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బ్యాచ్ మందులను ఎక్కడా అమ్మకూడదని, వెంటనే వెనక్కి పంపాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రంగంలోకి దిగారు.
ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా పసిపిల్లల భద్రత విషయంలో రాజీపడేది లేదని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది.
మీరు ఏం చేయాలి?
ఒకవేళ మీ ఇంట్లో అధికారులు సృష్టం చేసిన బ్యాచ్ నంబర్ గల సిరప్ ఉంటే వెంటనే వాడటం ఆపేయండి. ఆ సిరప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు తాగించవద్దు.
మీ దగ్గర ఈ సిరప్ ఉంటే వెంటనే దగ్గరలోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కు లేదా అధికారులకు సమాచారం ఇవ్వండి. టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా నేరుగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను సంప్రదించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications